రాష్ట్రీయం

డ్రగ్స్ సరఫరా ఆపేదెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: హైదరాబాద్‌లోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో మంగళవారం డ్రగ్స్ కేసులో పై సమీక్ష సమావేశం జరిగింది. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, సిట్ ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో విదేశాల నుంచి వచ్చే డ్రగ్స్‌ను ఎలా అరికట్టాలి అనే దానిపై చర్చించారు.
దాదాపు మూడు గంటలపాటు జరిగిన సమావేశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) డిప్యూటీ డైరెక్టర్ ఆర్‌పి సింగ్, జోనల్ డైరెక్టర్ సునిల్ కుమార్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్‌ఐ) అదనపు డిజి ఎంకె సింగ్, ఏడి ప్రసాద్, తెలంగాణ ఏడిజిపి గోవింద్ సింగ్, రాచకొండ అదనపు డిసిపి డివి శ్రీనివాసరావు, ప్రొబిషన్ ఎక్సైజ్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ ఆర్‌వి చంద్రవదన్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ డిప్యూటీ డైరెక్టర్ బి వెంకటేశ్వర్లు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అసిస్టెంట్ కమిషనర్ (క్రైమ్ కస్టమ్స్) షేక్ కరీముల్లా, అదనపు కమిషనర్ ఆర్‌కె రమణ్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏకె మహంతి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల నగరంలో డ్రగ్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ తీసుకున్న చర్యలు, విచారణ, కొకైన్ ట్రాఫిక్కింగ్ నెట్‌వర్క్, ఆఫ్రికన్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌పై చర్చించారు.
మాదకద్రవ్యాల నియంత్రణ, విమానాశ్రయాల్లో తనిఖీలు, మాదకద్రవ్యాల తయారీ, సరఫరా వంటి అంశాలపై చర్చించడంతోపాటు డ్రగ్స్‌పై అవగాహన సదస్సులు, సెంట్రల్ ఫండింగ్ పథకాలపై కూడా అధికారులు సమీక్ష జరిపారు. హైదరాబాద్‌ను డ్రగ్ రహిత నగరంగా మార్చాలని, మాదకద్రవ్యాలపై గట్టి నిఘా వేయాలని, అందుకు తగు చర్యలపై అధికారులు చర్చించారు.