రాష్ట్రీయం

ఆర్టీసి విభజనపై కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ విభజనపై మూడేళ్లుగా సాగుతున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనపడుతోంది. ఈ నెల 24వ తేదీన విజయవాడలో రెండు రాష్ట్రాల ఆర్టీసి పాలకమండళ్ల సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆర్టీసి విభజన సాంకేతికంగా జరిగినా కేంద్రం అధికారికంగా రాజముద్ర వేయలేదు. రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్ల తర్వాత 2016లో ఇక్కడ ఉన్న బస్ భవన్ నుంచి ఏపిఎస్‌ఆర్టీసి విజయవాడకు తరలివెళ్లింది. కాగా హైదరాబాద్‌లో ఉన్న కొన్ని స్ధిరాస్తులు, భవనాల విభజనకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. విజయవాడలో జరిగే ఆర్టీసి పాలక మండలి సమావేశంలో అనేక కీలకాంశాలపై తీర్మా నం చేయనున్నారు. ఈ తీర్మానాలను విభజన సాఫీగా జరిగేందుకు పర్యవేక్షణ కమిటీ షీలాబేడీ కమిటీకి, కేంద్రం, ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలకు పంపించనున్నారు. ప్రస్తుతం టిఎస్‌ఆర్టీసి, ఏపిఎస్ ఆర్టీసి ఎవరికి వారు ఆదాయ, ఖర్చు వివరాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. వచ్చిన ఆదాయంలో నుంచే సిబ్బందికి వేతనాలు చెల్లిస్తున్నారు. ఉమ్మడి ఏపిఎస్‌ఆర్టీసిలో కేంద్రప్రభుత్వం వాటాదారుగా ఉంది. కేంద్రం వాటా దాదాపు రూ.230 కోట్లు ఉంది. విభజన అనే ప్రక్రియ వాస్తవ, ఆర్థిక, భౌతిక విభజన అనే ప్రక్రియలు జరిగిన తర్వాత కేంద్రం తన సమ్మతి తెలియచేస్తుంది. రోడ్డు రవాణా సంస్ధ చట్టం 1950 ప్రకారం కేంద్రం ఆస్తులు, అప్పులు, రెండు సంస్ధలకు పంపకానికి సం బంధించి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతనే ఏపిఎస్ ఆర్టీసి విభజన అయినట్లు భావించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌లో ఉద్యోగుల పంపకాలు కూడా ఉంటాయి. పాలక మండలిలో ఏపిఎస్ ఆర్టీసి ఎండి, తెలంగాణ ఆర్టీసి ఎండితో పాటు రెండు రాష్ట్రాల రవాణా శాఖ, ఆర్ధిక శాఖ కార్యదర్శులు, జిహెచ్‌ఎంసి కమిషనర్, కార్మిక శాఖ ప్రతినిధి ఉన్నారు.