రాష్ట్రీయం

పోలీసు కస్టడీకి మల్లాది విష్ణు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 13: కల్తీ మద్యం కేసులో అరెస్టయి జైలులో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణును పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈమేరకు విజయవాడ రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కృష్ణలంక స్వర్ణ బార్‌లో మద్యం సేవించి గత ఏడాది డిసెంబర్ 7న ఐదుగురు వ్యక్తులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కాగా బార్‌లో కల్తీ జరిగిందనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన కృష్ణలంక పోలీసులు బార్ సిబ్బంది తొమ్మిది మందిని అరెస్టు చేసి రిమాండుకు పంపగా ఇటీవలే వారికి బెయిల్ మంజూరైంది. అయితే బార్ లైసెన్స్ దారుల్లో మల్లాది విష్ణు తల్లి బాల త్రిపుర సుందరమ్మ పేరుతోపాటు సోదరి, బావ, బంధువులపై కూడా కేసులు నమోదయ్యాయి.
ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈనెల జనవరి 6,7న మల్లాది విష్ణును 41ఏ సిఆర్‌పిసి నోటీసుల కింద విచారించి వ్యూహాత్మకంగా 7న రాత్రి అరెస్టు చేసినట్లు ప్రకటించారు. మరుసటి రోజు 8న విష్ణును కోర్టులో హాజరుపర్చగా కొన్ని గంటల నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఎట్టకేలకు కోర్టు ఆదేశాలతో ఆయన్ను పోలీసులు రిమాండుకు పంపారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ఉన్న మల్లాది విష్ణును విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిసినందున నాలుగు రోజుల పాటు అనగా ఈనెల 14 నుంచి 17 వరకు కస్టడీకి ఇస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సిట్ నిందితుడిని విచారించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా విష్ణు తరుఫున దాఖలైన బెయిల్ పిటిషన్‌ను ఈనెల 19కి వాయిదా వేస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.

మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌కు
అదనపు ఎసి బోగీ
నేటినుంచే అమలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 13: సికింద్రాబాద్- మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌కు ఈ నెల 14 నుంచి 31 వరకు తాత్కాలికంగా ఫస్ట్ క్లాస్ ఎసి బోగీని ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. దీనితో 864 అదనపు బెర్తులు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది.
విస్తృత తనిఖీ
రైళ్లలో టిక్కెట్లు లేని ప్రయాణికులను పట్టుకునేందుకు రైల్వే అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. పండుగ రద్దీతో పాటు శబరిమల యాత్ర భక్తుల సంఖ్య పెరగడంతో అందుకు అనుగుణంగా రద్దీ పెరిగింది. ఈ నెల 12న అధికారులు సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, మంచిర్యాల స్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు. 1013 మంది టిక్కెట్లు లేనివారిని పట్టుకున్నారు.