రాష్ట్రీయం

బెంగళూరు-హౌరా మధ్య ప్రత్యేక రైళ్ళు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 22: ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్ళు నిర్వహిస్తోంది. ఈ మేరకు డివిజనల్ కమర్షియల్ మేనేజర్(కో ఆర్డినేటర్) జి.సునీల్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-హౌరా, హౌరా-యశ్వంత్‌పూర్, బెంగళూరు సిటీ-హౌరా, మాల్దాటౌను-బెంగళూరు కంటోనె్మంట్‌ల మధ్య ఇవి నడుస్తాయి.
బెంగళూరుసిటీ-హౌరా(02501)
బెంగుళూరు సిటీ-హౌరా(02501)ల మధ్య నడిచే ఇది బెంగళూరు సిటీలో మంగళవారం తెల్లవారుజామున 3.10గంటలకు బయలుదేరిన ఈ రైలు రాత్రి 10.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంది. ఇక్కడ 20నిమిషాలు హాల్ట్ తదుపరి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.55 గంటలకు వెళ్తుంది. ఈ ప్రత్యేక రైలులో ఏసి టు టైర్-1, ఏసి త్రి టైర్-4, స్లీపర్ క్లాస్‌లు-14, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు-2, సెకండ్ క్లాస్ సిటింగ్ కమ్ లగేజి కమ్ లగేజీ కోచ్‌లు-2 ఉంటాయి. ఇదే ప్రత్యేక రైలు హౌరా-కెఎస్‌ఆర్ బెంగళూరు సిటీ(02502)ల మధ్య నడువనుంది. హౌరాలో ఈ నెల 27వ తేదీన అర్ధరాత్రి దాటిన తరువాత 1.05 గంటలకు బయలుదేరి విశాఖపట్నంనకు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుకుంటుంది. ఇక్కడ నుంచి బయలుదేరి కెఎస్‌ఆర్ బెంగళూరు సిటీకి మరుసటి రోజు ఉదయం 11.50 గంటలకు వెళ్తుంది. ఇందులో ఏసి టు టైర్-2, త్రి టైర్-7, స్లీపర్ క్లాస్-10, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు-2, సెకండ్ క్లాస్ సిటింగ్ కమ్ లగేజీ కోచ్‌లు-2 సౌకర్యం కల్పించింది. ఇది బెంగళూరు కంటోనె్మంట్, కృష్ణరాజాపురం, బంగార్‌పేట, జోలార్‌పెట్టాయ్, కాట్పాడి, పేరంబూర్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, బ్రహ్మపూర్, ఖుర్దారోడ్డు, భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్ మీదుగా నడుస్తుంది.
హౌరా-యశ్వంత్‌పూర్ (02552)
ఈ ప్రత్యేక రైలు హౌరాలో ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు బయలుదేరి విజయనగరానికి అదేరోజు రాత్రి 10గంటలకు చేరుకుంటుంది. ఇక్కడ కేవలం పది నిమషాలు హాల్ట్ తర్వాత నేరుగా బయలుదేరి యశ్వంత్‌పూర్‌కు మరుసటి రోజు రాత్రి 6.25 గంటలకు వెళ్తుంది. ఈ ప్రత్యేక రైలు ఖరగ్‌పూర్, హిజ్లీ, బాలాసోర్, కటక్, భువనేశ్వర్, ఖుర్దారోడ్డు, బ్రహ్మపూర్, విజయనగరం, సామర్లకోట, విజయవాడ, గూడూరు, చెన్నై, కాట్పాడి, జోలార్‌పెట్టాయ్ స్టేషన్ల మీదుగా నడువనుంది. ఇందులో ఏసి టు టైర్-1, ఏసి త్రి టైర్-4, స్లీపర్ క్లాస్-14, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు-2, సెకండ్ క్లాస్ సిటింగ్ కమ్ లగేజీ కోచ్‌లు-2 సదుపాయం కల్పించారు.
కెఎస్‌ఆర్ బెంగళూరు సిటీ-హౌరా(02509)
బెంగళూరు కంటోనె్మంట్-హౌరా(02509)ల మధ్య నడిచే ప్రత్యేక రైలు ఈ నెల 23వ తేదీన రాత్రి 11.40 గంటలకు బెంగుళూరులో బయలుదేరి విశాఖపట్నంనకు మరుసటిరోజు రాత్రి 7.15గంటలకు చేరుకుంటుంది. ఇక్కడ నుంచి హౌరాకు మరుసటి రోజున ఉదయం 10.55గంటలకు వెళ్తుంది. ఈ ప్రత్యేక రైలు కృష్ణరాజాపురం, బంగార్‌పేట, జోల్‌పెట్టాయ్, కాట్పాడి, అరక్కోణం, చెన్నై, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బ్రహ్మపూర్, బాలుగాన్, ఖుర్దారోడ్డు, భువనేశ్వర్, కటక్, జయపూర్ కింజర్‌రోడ్డు, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, సంత్రగాచీ స్టేషన్ల మీదుగా ఇది నడుస్తుంది. ఏసి టురైట్-2, ఏసి త్రిటైర్-7, స్లీపర్ క్లాస్-10, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు-2, సెకండ్ క్లాస్ సిటింగ్ కమ్ లగేజీ కోచ్‌లు-2ల సదుపాయం కల్పించారు.
మాల్దా టౌన్-బెంగళూరు కంటోనె్మంట్(02504)
మాల్దా టౌను-బెంగళూరు కంటోనె్మంట్(02504)ల మధ్య నడిచే ఈ ప్రత్యేక రైలు మాల్దాటౌనులో ఈ నెల 23వ తేదీన ఉదయం 6.50 గంటలకు బయలుదేరుతుంది. ఇది విశాఖపట్నంనకు 24వ తేదీ తెల్లవారుజామున 2.10గంటలకు చేరుకుని ఇక్కడ నుంచి బయలుదేరే ఇది బెంగళూరుకు అదేరోజు రాత్రి 9.15 గంటలకు వెళ్తుంది. ఈ ప్రత్యేక రైలు రామ్‌పుర్హత్, ఖానా, బార్దామన్, హౌరా, ఖరగ్‌పూర్, భద్రక్, కటక్, భువనే్వశర్, ఖుర్దారోడ్డు, బరంపూర్, పలాస, శ్రీకాకుళంరోడ్డు, విజయనగరం, విశాఖపట్నం, దువ్వాడ, విజయవాడ, పెరంబూర్, కాట్పాడి, వైట్‌ఫీల్డ్ స్టేషన్ల మీదుగా నడుస్తుందని సునీల్‌కుమార్ తెలిపారు.