రాష్ట్రీయం

అజేయశక్తిగా నేవీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 22: ఇండియన్ ఓషన్‌లో భారత నౌకాదళం అజేయశక్తిగా నిలవాలని నౌకాదళ ప్రధాన అధికారి అడ్మిరల్ సునీల్ లాంబా పిలుపునిచ్చారు. తూర్పు నౌకాదళ స్వర్ణోత్సవాల్లో భాగంగా నేవీ ఆడిటోరియం సాముద్రికలో రెండు రోజులపాటు వివిధ అంశాలపై జరిగే సదస్సును లాంబా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు నౌకాదళం ఆవిర్భవించినప్పటి నుంచి నేటి వరకూ అనేక మైలురాళ్లు దాటుకుంటూ వచ్చిందని అన్నారు. భారత సముద్ర జలాలకు ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను పరిరక్షించాల్సిన బాధ్యత నౌకాదళంపై ఉందని అన్నారు. ఇందుకు అనువైన వ్యూహాలను అమలు చేయాలని ఆయన సూచించారు. సముద్ర జలాల పరిరక్షణకు నేవీతోపాటు, సంబంధిత వ్యవస్థలు కూడా ఎప్పటికప్పుడు సమన్వంతో పనిచేయాలని ఆయన సూచించారు. మాజీ నేవీ చీఫ్, నేషనల్ మెరిటైం ఫౌండేషన్ చైర్మన్ అడ్మిరల్ ఆర్‌కె థవన్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రభుత్వ విధానాలను పరిరక్షించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. తొలిరోజు జరిగిన మొదటి సెషన్‌లో అడ్మిరల్ అరుణ్ ప్రకాష్ (రిటైర్డ్) మాట్లాడుతూ మెరిటైం పవర్‌లో భారత నౌకాదళం పటిష్ఠంగా ఉందని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేవీ తమ వ్యూహాలను మలచుకోవాలని సూచించారు. వైస్ అడ్మిరల్ ప్రదీప్ చౌహాన్ (రిటైర్డ్) మాట్లాడుతూ ఇండియన్ ఓషన్‌లో చైనా చొరబాటు, దాని ప్రభావం గురించి మాట్లాడారు. ప్రొఫెసర్ బ్రహ్మ మాట్లాడుతూ భారత దేశం సంప్రదాయేతర సవాళ్లను ఎదుర్కోవలసి వస్తోందని అన్నారు. వీటికి దీటుగా బదులిచ్చేందుకు నేవీ సిద్ధంగా ఉండాలని అన్నారు. రెండో సెషన్‌లో వైస్ అడ్మిరల్ అనూప్ సింగ్, కెప్టెన్ సురేష్ భరద్వాజ్ మాట్లాడుతూ మన ముందున్న సవాళ్లను ఎదుర్కొనాలంటే, వౌలిక సదుపాయాలను మెరుగుపరచుకోవలసి ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ముఖ్యంగా పోర్టులు, షిప్ బిల్డింగ్‌ను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. శాస్తవ్రేత్త ఎస్.రామసుందరం మాట్లాడుతూ నావికా దళాలు మరంత సమర్థవంతంగా పనిచేయడానికి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సహకారాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. మూడో సెషనల్‌లో వైస్ అడ్మిరల్ రమణ పి.సుథాన్(రిటైర్డ్) రియర్ అడ్మిరల్ ఎస్‌వై శ్రీఖండే మాట్లాడుతూ ఆకస్మికంగా ఎదురయ్యే సవాళ్లు మన సైన్యం మీద, దేశ బడ్జెట్ మీద ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఇండియన్ కోస్ట్‌గార్డ్ డిఐజి దోనీ మైఖెల్, కెప్టెన్ గురుప్రీత్ ఖురానా తదితరులు న్నారు.