రాష్ట్రీయం

అమ్మ కోసం అనే్వషణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: తెలిసీ తెలియని వయసులో తల్లికి దూరమైన ఇద్దరు పిల్లలు పెద్దయ్యారు. తల్లి ప్రేమను కావాలనుకున్న ఆ యవతులు సౌదీ నుంచి పాతబస్తీకి చేరుకున్నారు. తల్లి ప్రేమకు దూరమైన ఆ ఇద్దరు యువతులకు పోలీసులు అండగా నిలిచి వెతకడం ప్రారంభించారు. సినిమా కథను తలపించే వీరి యదార్థగాథ వివరాల్లోకి వెళితే.. 1981 డిసెంబర్‌లో పాబస్తీకి చెందిన రజియా బేగం వివాహం సౌదీ అరేబియాకు చెందిన రషీద్ అనే వ్యక్తితో జరిగింది. భార్యను తనతోపాటే తీసుకెళ్లిన రషీద్ కొంతకాలం తరువాత ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదం విడాకులకు దారితీసింది. దీంతో 1988లో భర్తనుంచి విడాకులు తీసుకున్న రజియాబేగం హైదరాబాద్‌కు వచ్చేసింది. కాగా అప్పుడు ఆమెకు ఇద్దరు సంతానం. వారే ఆయేషా, ఫాతిమా. అప్పట్లో వారి వయసు నాలుగేళ్లు.
కాగా ఇటీవల రషీద్ చనిపోయే ముందు తన కూతుళ్లకు విషయాన్నంతా చెప్పాడు. పెళ్లినాటి ఫొటో, పెళ్లి సర్ట్ఫికెట్ పిల్లలకు ఇచ్చాడు. వీటి ఆధారంగా పెద్దయిన ఆ ఇద్దరు యువతులు తల్లి ప్రేమను కావాలనుకున్నారు. ఫొటో ఆధారంగా వారు హైదరాబాద్‌కు చేరుకొని దక్షిణ మండలం పోలీసులను ఆశ్రయించారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని రజియా ఆచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నగరంలోని అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. ముమ్మర దర్యాప్తును చేపట్టిన పోలీసులు పురోగతిని సాధించినట్టు సౌత్‌జోన్ డిసిపి సత్యనారాయణ తెలిపారు. రషీద్‌తో రజియాబేగంకు నిఖా చేసిన ఖాజి మృతి చెందగా, నిఖాకు సాక్ష్యంగా నిలిచిన వ్యక్తి ఉన్నాడని, అతను రజియాకు స్వయాన సోదరుడైన సయ్యద్ ఖాజాపాషా అని తేలిందన్నారు. రెండు, మూడ్రోజుల్లో రజియా బేగం ఆచూకీ తెలుసుకొని సౌదీ నుంచి వచ్చిన ఆ యువతులను వారి తల్లితో కలుపుతామని డిసిపి సత్యనారాయణ వివరించారు.