రాష్ట్రీయం

అన్నదాతకు బాసట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: రైతులకు చేయూత ఇచ్చేందుకు తలపెట్టిన రైతు సమన్వయ సమితులకు సభ్యులు, సమన్వయకర్తలను (కోఆర్డినేటర్లు) వచ్చే నెల వరకు నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, మండల, జిల్లా, రాష్టస్థ్రాయిలలో వీటిని ఏర్పాటు చేసేందుకు వీలుగా ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. రెవెన్యూ గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసే సమితిలో కోఆర్డినేటర్‌తో సహా 15మంది సభ్యులు ఉంటారు. మండల స్థాయిలో కోఆర్డినేటర్‌తో సహా 24మంది సభ్యులు, జిల్లాస్థాయిలో కోఆర్డినేటర్‌తో సహా 24మందిని సభ్యులుగా, రాష్టస్థ్రాయిలో 42మంది సభ్యులు ఉంటారు. ఈ సభ్యులందరినీ నామినేషన్ ప్రాతిపదికన నియమిస్తారు. గ్రామస్థాయిలో మూడో వంతు సభ్యులు మహిళలు, మరో ముగ్గురు వివిధ వర్గాలకు చెందిన వారు ఉంటారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ నోడల్ అధికారిగా ఉంటారు. జిల్లా వ్యవసాయ అధికారి కలెక్టర్‌కు సాయం గా వ్యవహరిస్తారు. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ కమిషనర్ అండ్ డైరెక్టర్ రాష్ట్ర నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.
2018-19నుండి ప్రతి ఎకరాకు రైతుకు 4వేల రూపాయలు పెట్టుబడి (విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన తరుణంలో రైతు సమన్వయ సమితులకు ప్రాధాన్యముంటుంది. వీటి ద్వారానే రైతులకు ఆర్థిక సాయం అందుతుంది. సెప్టెంబర్ 9లోగా వీటి నామినేషన్ పూర్తవుతుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ రైతు సమగ్ర సర్వేను పూర్తి చేసింది. ఈ సర్వే ప్రకారమే ఎందరు రైతులు లబ్ధిదారులుగా ఉంటారో వెల్లడిస్తారు.సభ్యుల నామినేషన్ బాధ్యతను మంత్రులకు అప్పగించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు పోచారం శ్రీనివాసరెడ్డి, జనగామ, వరంగల్ (రూరల్), (అర్బన్)లకు కడియం శ్రీహరి, కరీంనగర్, పెద్దపల్లిలకు ఈటెల రాజేందర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాలకు కె.టి.రామారావు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటలకు హరీష్‌రావులను నియమించారు. ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్‌లకు జోగురామన్న, నిర్మల్, మంచిర్యాలలకు ఇంద్రకరణ్‌రెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలకు పి.మహేందర్‌రెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు జగదీష్‌రెడ్డి, ఖమ్మం, కొత్తగూడెంలకు తుమ్మలనాగేశ్వరరావు, మహబూబ్‌నగర్ జిల్లాకు సి. లక్ష్మారెడ్డి, నాగర్‌కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు జూపల్లి కృష్ణారావు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలకు అజీరా చందులాల్‌లను నియమించారు. రాష్టస్థ్రాయిలో ఏర్పాటయ్యే రైతు సమన్వయ సమితికి 500 కోట్ల రూపాయలు కేటాయించాలని, పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేందుకు వీలుగా ఈ నిధులను వినియోగించాలని నిర్ణయించారు.