రాష్ట్రీయం

ఉద్యమాల అణచివేతను నిరసిస్తూ హైదరాబాద్‌లో జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాఉద్యమాలను అణచివేతను నిరసిస్తూ, సెప్టెంబర్ 2, 3 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్టు సిఎస్‌ఆర్‌ఓ నాయకులు ప్రొఫెసర్ లక్ష్మణ్, ఎన్ నారాయణ రావు, చిలుక చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను వారు ఆదివారం ఆవిష్కరించారు. సెప్టెంబర్ 2న ఆదివాసీ మహిళలపై జరుగుతున్న దాడులపై చర్చ, 3న క్రాంతి చైతన్య ఉద్యమాలపై అణచివేతపై సదస్సు చర్చిస్తుందని తెలిపారు. ‘ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్-స్టేట్ రెప్రెస్సన్’పై మాలిని సుబ్రహ్మణ్యం, ‘రోల్ ఆఫ్ సివిల్ అండ్ డెమోక్రటిక్ రైట్స్ మూవ్‌మెంట్’పై ప్రొఫెసర్ హరగోపాల్, జగన్‌మోహన్ సింగ్ ఉపన్యసిస్తారని వారు పేర్కొన్నారు.