రాష్ట్రీయం

నేడు సిఎస్‌ల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సోమవారం సమావేశమై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, అంశాలను చర్చించనున్నారు. ఈ సమావేశానికి గవర్నర్ చొరవ తీసుకున్నట్లు సమాచా రం. ఆంధ్రాలో తెలంగాణకు చెందిన 800మంది నాలుగో తరగతి ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరు తమను తెలంగాణకు బదిలీ చేయాలని ఆందోళన చేస్తున్నారు. వీరి సమస్య ఈ చర్చల్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఏపి ప్రభు త్వం 2015 లో సచివాలయం భవనాలను ఖాళీ చేసింది. ఈ భవనాలను అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. కాని దీనిపై ఇంతవరకు ఏపి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. హైకోర్టు విభజన అంశం కేంద్రం పరిధిలో ఉన్నా, దీనిపై తాము తీసుకుంటున్న చర్యలను ఆంధ్ర ప్రభుత్వం తెలియచేసే అవకాశం ఉంది. పునర్విభజన చట్టంలో షెడ్యూల్ 9,10లో ప్రభుత్వ రంగ సంస్థల విభజన ఇంకా అపరిష్కృతంగా ఉంది. ఈ అంశాల పరిష్కారానికి ముగ్గురు సభ్యుల కమిటీని గవర్నర్ ఏర్పాటు చేశారు. అంతకు ముందు గవర్నర్ వద్ద రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రుల కమిటీ కూడా మూడు సార్లు సమావేశమైంది. కాని ఎటువంటి పురోగతి కనపడలేదు. రెండు రాష్ట్రాల మధ్య వివాదస్పదంగా ఉన్న అంశాలను కూలంకషంగా చర్చించి కోర్టుకు వెళ్లకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని గవర్నర్ సూచించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంతరాష్ట్ర ఉద్యోగుల బదిలీలపై మార్గదర్శకాలను జారీ చేశాయి. ఆర్టీసి విభజనకు సంబంధించి 24వ తేదీన విజయవాడలో జరిగిన సమావేశంలో ఆశించిన పురోగతి కనపడలేదు.
విద్యుత్ బకాయిలపై చర్చ
తమకు తెలంగాణ ప్రభుత్వం రూ.3100 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయని ఆంధ్రప్రభుత్వం గతంలోనే తెలంగాణ విద్యుత్ శాఖకు సమాచారం ఇచ్చింది. కాగా తమకు రూ.1700 కోట్ల విద్యుత్ బకాయిలు ఆంధ్రచెల్లించాల్సి ఉంటుందని తెలంగాణ విద్యుత్ శాఖ ఏపి జెన్కోకు లేఖ రాసింది. రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ సరఫరా లేదు. ఈ అంశం కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.