రాష్ట్రీయం

బిసి బిల్లు ఆమోదించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: బిసి బిల్లుకు మద్దతునివ్వాల్సిందిగా బిసి సంఘాల నాయకులు బిజెపి ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ను కోరారు. బిసి సంఘం జాతీ య అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అధ్వర్యంలో పలు బిసి సంఘాల నాయకులు ఆదివారం రాంమాధవ్ ను కలిసి ఈ మేరకు చర్చలు జరిపారు. బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య పలు డిమాండ్లను రాం మాధవ్ దృష్టికి తీసుకెళ్ళారు. పార్లమెంటులో బిసి బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభలలో 50శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, బిసి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేయాలని, బిసిల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బిసిల జనాభా ప్రకారం 27నుంచి 56శాతానికి పెంచాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో బిసిల సామాజిక రక్షణ, భద్రత కల్పించేందుకు బిసి చట్టాన్ని చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ సంస్థల్లో బిసిల రిజర్వేషన్లను 34 నుంచి 50శాతానికి పెంచాలని, ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని, కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, ఏటా 50 వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.