రాష్ట్రీయం

భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: ఉత్తరాదిన భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తూ, హర్యానాలో శాంతిభద్రతల దృష్ట్యా మరికొన్ని రైళ్లను కుదించినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం ఉమాశంకర్ కుమార్ తెలిపారు. ఈనెల 29న బయలుదేరాల్సిన ట్రైన్ నెం. 22501 కెఎస్‌ఆర్ బెంగుళూరు-న్యూ తిన్సుకియా ఎక్స్‌ప్రెస్ రైలును, ఈనెల 30, 31న బయలుదేరాల్సిన ట్రైన్ నెం. 12509 బెంగళూరు కంటోనె్మంట్-గౌహతి ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. ట్రైన్ నెం. 07007 సికిందరాబాద్-దర్భంగా ప్రత్యేక రైలు బరౌనీ వరకు కుదించినట్టు ఆయన పేర్కొన్నారు. ట్రైన్ నెం. 07008 దర్భంగా-సికిందరాబాద్ ప్రత్యేక రైలు, దర్భంగాకు బదులుగా బరౌనినుంచి బయలుదేరుతుంది. అదేవిధంగా హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు వెళ్లాల్సిన పలు రైళ్లను ఆ రాష్ట్రాల్లో శాంతిభద్రతల దృష్ట్యా రద్దు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. అమృత్‌సర్-హెచ్‌ఎస్ నాందేడ్ ఎక్స్‌ప్రెస్, హెచ్‌ఎస్ నాందేడ్- శ్రీగంగానగర్ ఎక్స్‌ప్రెస్, మాతా వైష్ణోదేవి కత్రా-యశ్వంత్‌పూర్, మాతా వైష్ణోదేవి కత్రా- చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, చెన్నై-మాతా వైష్ణోదేవి కత్రా ఎక్స్‌ప్రెస్, మాతావైష్ణోదేవి కత్రా-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దయినట్టు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఉమాశంకర్ కుమార్ పేర్కొన్నారు.