రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 28: ఛత్తీస్‌ఘడ్ పరిసరాలను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. దీనికి అనుబంధంగా ఉపతర ఆవర్తనం 7.6 కిమీ ఎత్తున కొనసాగుతోందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, ఒకటి,రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే దక్షిణ కోస్తా తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 50 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయనగరం జిల్లా సాలూరులో అత్యధికంగా 16 సెంమీ, శ్రీకాకుళం జిల్లా పలాసలో 12 సెంమీ, విజయనగరం జిల్లా కొమరాడ, బూరుగుపల్లి, విశాఖ జిల్లా పాడేరులో 9సెంమీ, విజయనగరం జిల్లా సీతానగరం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, టెక్కలిలో 8 సెంమీ, విజయనగరం వేపాడ, జియ్యమ్మవలసలో 7 సెంమీ వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి వర్షాల కారణంగా ఇంటి గోడ కూలి బి జయలక్ష్మి(89) మృతి చెందింది.