రాష్ట్రీయం

తెదేపాదే నంద్యాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 28: రాష్టవ్య్రాప్తంగా ఉత్కంఠ రేపిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో తెలుగుదేశం ఘన విజయం సాధించింది. తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 27 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి 97,076 ఓట్లురాగా, సమీప ప్రత్యర్థి వైకాపాకు చెందిన శిల్పా మోహన్‌రెడ్డికి 69,610 ఓట్లు లభించాయి. దీంతో తెదేపా అభ్యర్థి 27,466 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో తెదేపా ఆదినుంచీ ఏకపక్షంగా ఆధిక్యత చూపించటం గమనార్హం. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. 250 పోస్టల్ బ్యాలెట్లు పంపిణీ చేయగా అందులో 39 బ్యాలెట్లు చిరునామా సరిగాలేక వెనక్కి వచ్చినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మిగిలిన 211 ఓట్లలో ఏ అభ్యర్థికీ ఓటు వేయకపోవడం గమనార్హం. తరువాత ఈవిఎంలను టేబుళ్లమీదకు తరలించి ఓట్లు లెక్కింపు ప్రారంభించారు. మొదటి రౌండులోనే 1198 ఓట్ల ఆధిక్యత సాధించిన తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, చివరి 19వ రౌండ్ వరకూ ఆధిక్యతలో కొనసాగారు. వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి కేవలం 16వ రౌండ్‌లో మాత్రమే 654 ఓట్ల ఆధిక్యత వచ్చింది. నంద్యాల మండలం పోలూరు గ్రామం నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభంకాగా, గోస్పాడు మండలం బివి నగర్ గ్రామ ఓట్ల లెక్కింపుతో ప్రక్రియ ముగిసింది. 8 రౌండ్లు పూర్తికాగానే వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. మధ్యాహ్నం 12.30కు ఓట్ల లెక్కింపు పూరె్తైంది. గ్రామీణ ప్రాంతాల్లో వైకాపా భారీ ఆధిక్యత సాధిస్తుందని ఆశించినా వారి ఆశలు వమ్ము చేస్తూ ఓటర్లు తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు పలికారు. గోస్పాడు మండలం దీబగుంట్ల గ్రామంలో మాత్రమే వైకాపా స్పష్టమైన మెజార్టీ సంపాదించింది. దాదాపు అన్ని గ్రామాల్లో తెదేపా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలిగింది. ఉప ఎన్నికలో గెలిచిన తెదేపా అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి అధికారికంగా ధృవీకరణ పత్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి సత్యనారాయణ అందించారు.
నంద్యాలలో పోలింగ్ అనంతరం తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పాసులు ఉన్నవారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాలకు అనుమతించారు. నియోజకవర్గంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

చిత్రం..రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న భూమా బ్రహ్మానందరెడ్డి