రాష్ట్రీయం

డెడ్‌లైన్ డిసెంబర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: వచ్చే నాలుగు నెలలు క్షేత్రస్థాయి ప్రభుత్వ యంత్రాంగానికి కీలకం కానుంది. డిసెంబర్ నాటికి సమగ్ర భూ సర్వే, మిషన్ భగీరథ, 2 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వంటి మూడు ప్రధాన కార్యక్రమాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం డెడ్‌లైన్‌గా విధించింది. సెప్టెంబర్ 1నుంచి డిసెంబర్ నెలాఖరుకు సమగ్ర భూ సర్వేను పూర్తి చేసే బాధ్యతను రెవిన్యూ, వ్యవసాయ శాఖకు అప్పగించింది. మరోవైపు ఇంటింటికి మంచినీటి సరఫరా పనులను ఎట్టిపరిస్థితుల్లో డిసెంబర్‌కు పూర్తి చేసి జనవరి ఒకటికి నూతన సంవత్సర కానుకగా మంచినీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం గడువులోగా పూర్తికావడానికి ప్రజాప్రతినిధులు స్వయంగా పనులను పర్యావేక్షించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అలాగే సమగ్ర భూ సర్వే సకాలంలో పూర్తి చేయడానికి సిఎం నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పర్యవేక్షణ బాధ్యతలను కూడా సిఎం అప్పగించారు. ప్రజాప్రతినిధులంతా తమ నియోజకవర్గాలలోనే ఉంటూ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న మూడు ప్రధాన కార్యక్రమాలపై దృష్టి సారించాలని సిఎం ఆదేశించారు. ఈ కార్యక్రమాలు పూర్తయ్యేవరకు ప్రజాప్రతినిధులు ఎవరూ అవసరమైతే తప్ప హైదరాబాద్‌లోకానీ, తన కార్యాలయానికికానీ రావద్దని సిఎం హెచ్చరించారు. సమగ్ర భూ సర్వే నిర్వహణకు 1100 రెవిన్యూ గ్రామాలకు 3600 మంది రెవిన్యూ, వ్యవసాయ శాఖలకు చెందిన ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించింది. ప్రజాప్రతినిధులు స్థానికంగా ఉండటంతోపాటు క్షేత్రస్థాయి ఉద్యోగులకు ఊపిరి సలపనంత పనిని అప్పగించడంతో డిసెంబర్
వరకు బిజి బిజీ కానున్నారు. ఇలా ఉండగా డిసెంబర్ నాటికి రాష్టవ్య్రాప్తంగా రెండు లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి చేయనున్నట్టు శాసనసభలో సిఎం కెసిఆర్ స్వయంగా ప్రకటించారు. ఆమేరకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఊపందుకుంది. ఇప్పటికే 50 వేల ఇళ్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్టు గృహ నిర్మాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటించారు. మిగిలిన లక్ష 50 వేల నిర్మాణం కూడా డిసెంబర్ నెలాఖరుకు పూర్తి కావాల్సి ఉంది. భూ సర్వే, మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఈ మూడు కార్యక్రమాల్లో కలెక్టర్ మొదలుకొని గ్రామ రెవిన్యూ కార్యదర్శి వరకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు ఈ నాలుగు నెలలపాటు తలమునకలు కానుండటంతో అధికార యంత్రాంగం యావత్తూ బిజీగా మారనుంది.