రాష్ట్రీయం

జిపిఎస్ లింకుతో చంద్రన్న పర్యవేక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 29: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించటంలో భాగంగా చంద్రన్న సంచార వైద్య కేంద్రాలను జిపిఎస్ విధానంతో అనుసంధానించనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. దీనివల్ల ఏ వాహనం ఎక్కడ ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుంటుందన్నారు. చంద్రన్న వైద్య సంచార కేంద్రాల ద్వారా వైద్య, రోగనిర్ధారణ, నర్సింగ్ సేవలను ప్రజల వద్దకు తీసుకువెళ్లడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్‌యూనివర్శిటీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెడ్‌టెక్ జోన్ నిర్మాణంలో ప్రగతి, తదితర వివరాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యపరంగా ప్రజలకు మేలైన వైద్య సేవలు అందించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో మెడ్‌టెక్ జోన్ (ఎమ్‌టెజ్) ఏర్పాటు చేస్తున్నామన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలను ఇక్కడే ఉత్పత్తి చేయటం మెడ్‌టెక్ జోన్ ఏర్పాటు ప్రథమ లక్ష్యమన్నారు. ప్రస్తుతం ఆయా పరికరాలను 80 శాతం వరకు విదేశాల నుండే దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. నార్వే, స్విట్జర్‌లాండ్, జర్మనీ తదితర దేశాల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్య పరికరాల పరిశ్రమలు ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మెడ్‌టెక్ జోన్ పరిధిలో ఉన్నత ప్రమాణాలతో కూడి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వైద్య పరికరాల తయారీని అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారిపై న్యాయ పరిధికి లోబడి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ద్వారా పట్టణ ప్రాంతాల్లో వైద్య చికిత్సలను అందిస్తున్నామన్నారు. వీటి ద్వారా ప్రతిరోజూ 15వేల మందికి పైగా వైద్య సేవలు అందుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో 18 ఉచిత డయాగ్నస్టిక్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మెడ్‌టెక్ పార్క్ నిర్మాణం పారదర్శకంగా జరుగుతోందన్నారు. దానిపై వచ్చే ఆరోపణలు అవాస్తవమన్నారు. ఆ దిశలో వివిధ వైద్య సంబంధ అంశాలను ఎంతో పారదర్శకంగా చేపడుతున్నామన్నారు. వాటికి జవాబుదారీతనంతో కూడిన హామీని ఇస్తున్నామన్నారు. ప్రభుత్వపరంగా చేపట్టే పనుల్లో ఏమైనా సందేహాలు ఉంటే తమతో సంప్రదించి వివరణ తీసుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వ వైద్య సలహాదారు, ఎమ్‌టెజ్ సిఇవో జితేంద్రకుమార్ శర్మ ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్‌కు సంబంధించిన వివిధ దశల ప్రక్రియ, అందుకు పరిగణనలోకి తీసుకున్న అంశాలను విలేఖరులకు వివరించారు. విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు డాక్యుమెంటేషన్‌తో కూడిన వివరాలను అందించారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి కామినేని శ్రీనివాస్, పూనం మాలకొండయ్య, తదితరులు