రాష్ట్రీయం

అజెండా భూ ప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 29: భూరికార్డుల ప్రక్షాళనకు సంబంధించి క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమంపై మార్గనిర్దేశం చేసేందుకు ఈనెల 31న కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రగతి భవన్‌లో కలెక్టర్లతో సమావేశం కానున్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే రైతు సమన్వయ కమిటీల ఏర్పాటు, భూ రికార్డుల ప్రక్షాళన, పట్టాదారు పాస్ పుస్తకాలు, పహాణీ పత్రాలలో మార్పులు, రిజిస్ట్రేషన్స్ విధానంలో సంస్కరణలు తదితర అంశాలపై విధి విధానాలకు తుదిరూపం ఇవ్వనున్నట్టు సిఎం పేర్కొన్నారు. అదే రోజు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయాధికారుల సమావేశం జరుగుతుందన్నారు. రైతు సంఘాలు, రైతు సమన్వయ సమితిల నిర్మాణం, రైతు వేదికల ఏర్పాటు తదితర అంశాలపై చర్చిస్తామన్నారు. ఆ సమావేశానికీ హాజరు కానున్నట్టు సిఎం వెల్లడించారు.
మండలానికో ఆర్‌వో
ప్రతీ మండలంలో రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సిఎస్‌ను కెసిఆర్ ఆదేశించారు. ప్రస్తుతమున్న రిజిస్ట్రార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలను కొనసాగిస్తూ, ఇవీలేనిచోట కొత్త ఆఫీసులు ప్రారంభించాలని సూచించారు. కొత్త ఆఫీసులకు ఆర్‌వోలుగా ఎమ్మార్వోలకే అదనపు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతికి తావు లేకుండా పెద్దఎత్తున సంస్కరణలు ప్రవేశపెడతామన్నారు. కోర్ బ్యాంకింగ్ విధానం మాదిరిగానే ఇకపై భూముల రిజిస్ట్రేషన్, ఆస్తుల క్రయ విక్రయాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్ లైన్లో అప్‌డేట్ చేస్తారన్నారు. అన్ని రెవిన్యూ కార్యాలయాల్లో భూరికార్డుల నిర్వహణకు కోర్ బ్యాంకింగ్ తరహాలో భూముల క్రయ విక్రయాల నమోదు కోసం వెయ్యిమంది ఐటీ అధికారులను నియమించాలని ఆదేశించారు. భూ వివాదాల పరిష్కారాలకు ఇన్ని కోర్టులు అవసరం లేదన్నారు. కలక్టర్ కోర్టుకు ఒకదానినే కొనసాగించి మిగతా వాటిని రద్దు చేయాలన్నారు. పట్టాదారు పాసు పుస్తకం, పహాణీలను ప్రజలకు అర్థమయ్యేలా సరళంగా తయారు చేయాలని సూచించారు. వ్యవసాయానికి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి విధి విధానాలను ఖరారు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్‌ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.