రాష్ట్రీయం

వాటర్ ఫ్రంట్ పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 29: రాష్ట్రంలో అన్ని సాగునీటి ప్రాజెక్టులకు కొత్త ఆపరేషన్ మ్యాన్యువల్స్ రూపొందించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఏ ప్రాజెక్టు ద్వారా ఎంత నీటిని మిషన్ భగీరథకు వినియోగించాలో మదింపు చేయాలన్నారు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని యావత్ రాష్ట్రం అవసరాలను తీర్చడానికి డ్రింకింగ్ వాటర్ ఫ్రంట్ ఆఫ్ తెలంగాణ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే సాగునీటి ప్రాజెక్టుల నుంచి విద్యుదుత్పత్తికి ఎంత నీరు అవసరమో అంచనా వేసి పవర్ ఫ్రంట్ ఆఫ్ తెలంగాణ ఏర్పాటు చేయాలన్నారు. ప్రగతి భవన్‌లో మంగళవారం నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ ఉన్నతాధికారులతో సిఎం సమావేశమయ్యారు. గోదావరి, కృష్ణా నదుల ద్వారా అందుబాటులోకి వచ్చే జలాలను మంచినీరు, సాగునీరు, విద్యుత్, పారిశ్రామిక అవసరాలకు ఎంతమేరకు అవసరమో ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గోదావరి, కృష్ణా నదులపై అనేక ప్రాజెక్టులు కడుతున్నాం. ఈ రెండు నదుల నీటితో రైతులకు సాగునీరు అందించడంతో పాటు మంచినీటికి, పరిశ్రమల అవసరాలకు, విద్యుదుత్పత్తికి సరఫరా చేస్తున్నామన్నారు. ఏ రంగానికి ఎంత మేరకు నీరు అవసరమో స్పష్టత ఉండాలన్నారు. ప్రాజెక్టుల్లో చేరిన నీటి ఆధారంగా ప్రాధాన్యతలను నిర్ణయించుకోవాలన్నారు. దీని కోసం ప్రత్యేక విధానం అమలు చేయడానికి కొత్త ఆపరేషన్ మ్యాన్యువల్స్‌ను రూపొందించుకోవాలన్నారు. నీటి పారుదల, మిషన్ భగీరథ, విద్యుత్, పరిశ్రమల శాఖల అధికారులు సంయుక్త సమావేశం ఏర్పాటు చేసుకుని నదీ జలాల వాడకంపై అవగాహనకు రావాలని సిఎం సూచించారు. ప్రాజెక్టుల నీటిలో మంచినీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి రిజర్వాయర్లలో 10 శాతం నీరు కేటాయించామన్నారు. వచ్చే ఏడాదినాటికి కాళేశ్వరం ప్రాజెక్టు నీరు అందుబాటులోకి వస్తుందన్నారు. కాళేశ్వరం ద్వారా వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరా చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న నీటి లభ్యత, వనరులు, వచ్చే ఏడాది జూలైనాటికి ఉండే పరిస్థితిని అంచనా వేసి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. హైదరాబాద్ నగరంతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాల వారీగా ఎంత నీరు అవసరమో అంచనాలు తయారు చేయాలన్నారు.

చిత్రం..ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కెసిఆర్