రాష్ట్రీయం

గోదావరి మళ్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించడంపై ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. ఈ ఏడాది ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 42టిఎంసిల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించింది. నిరుడు 53టిఎంసిల గోదావరి జలాలను ఇదే ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించారు. ఒక వైపు కృష్ణా బేసిన్ ఎండిపోయి బోసిపోయింది. తెలంగాణలోని నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న 6.5లక్షల ఎకరాల ఆయకట్టుకు చుక్కు నీరు అందలేదు. హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు కృష్ణా జలాలను మంచినీటి నిమిత్తం అందించే పరిస్థితి కూడా లేదు. ఈ విషయాన్ని పలుసార్లు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖకు, కృష్ణాబోర్డుకు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు మళ్లించే హక్కు ఉందని తాజాగా కేంద్రానికి, కృష్ణా బోర్డుకు రాసిన లేఖలో పేర్కొంది. ‘పోలవరంలో పట్టిసీమ ఒక భాగం, పోలవరం జాతీయ ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మాత్రమే ఎగువ రాష్ట్రాలకు ఫలాలు అందుతాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కుడికాల్వ ద్వారా కృష్ణాడెల్టాకు నీరు అందుతాయి. పోలవరంలో అప్పుడు నిర్దేశించిన పరిణామంలో నీరు నిల్వ ఉంటుంది. ఇప్పుడు వరద సీజన్‌లోనే పట్టిసీమ నుంచి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్నామని ఏపి ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. ఒకసారి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా జలాల్లో 80టిఎంసిలు ఎగువ రాష్ట్రాలకు వాటా ఉంటుందని 1978 ఆగస్టు 4న గోదావరి జల వివాద ట్రిబ్యునల్ వద్ద ఒప్పందం కుదిరిన విషయం విదితమే. తెలంగాణ ప్రభుత్వం కూడా 163 టిఎంసిల వరకు గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తోందని ఏపి ప్రభుత్వం లేఖలో పేర్కొంది. తమ ప్రభుత్వం పట్టిసీమ నుంచి నీటిని తరలించేందదుకు 24టర్బైన్ పంపులను అమర్చిందని, ధవళేశ్వరం వద్ద తగిన నీటి మట్టం పర్యవేక్షిస్తూనే వరద కాలంలో వృథాగా సముద్రంలో కలిసే నీటిని డెల్టాకు ఇస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ఏపి ప్రభుత్వం చేసిన వాదనను తిరస్కరిస్తూ పూర్తి వివరాలతో ఒకటి రెండు రోజుల్లో లేఖ రాయనున్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం న్యాయసమ్మతమైన ఆధారాలతో తమకు చెందాల్సిన నీటి వివరాలను పొందుపరుస్తూ రెండుసార్లు లేఖ రాసింది.