రాష్ట్రీయం

జనం కోసమే మేము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 31: రాష్ట్భ్రావృద్ధి కోసం, ప్రజల మేలు కోసం శాశ్వతంగా తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలో ఉండటం తన కోసం కాదని, ప్రజలకు మేలు జరగడం కోసమేనని తెలిపారు. విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు వచ్చే అవకాశంపై పైవిధంగా సిఎం స్పందించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి ఓటు వేశారని, దానిని అన్నింటికీ వర్తింప చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల గురించి ఆలోచించాల్సిన సమయం కాదని, ప్రస్తుతం ఉన్న అభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో వివిధ సమస్యలు ఉన్నప్పటికీ, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని గుర్తుచేశారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల 80శాతం సంతృప్తిని కలిగించాల్సిన అవసరం ఉందన్నారు. రోజూ రాజకీయాల గురించి ఆలోచిస్తే, రాష్ట్రంలోకి పెట్టుబడులు రావన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎపి తలసరి ఆదాయంలో చివరన ఉందని, దీనిని దేశంలోనే మొదటి స్థానానికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక సహాయంతో సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సుస్థిర ప్రభుత్వం లేకపోయినా, లేదన్న అనుమానం కలిగినా, పెట్టుబడులు రావనన్నారు. రాష్ట్ర విభజన తరువాత ప్రజలు డిప్రెషన్‌లోకి వెళితే, తాను ఇచ్చిన పిలుపునకు స్పందించి, సహకరించారన్నారు. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భారత రాష్టప్రతి రామనాథ్ కోవింద్ తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్నందున ఘనంగా స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తిరుపతిలో పౌర సన్మానం ఏర్పాటు చేశామని, ఉపరాష్టప్రతికి స్వాగతం పలికిన తరహాలోనే రాష్టప్రతిని గౌరవించుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నానని తెలిపారు. కొంతకాలం చదివాక, చదివే అవకాశం లేకపోవడం నరకమన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్రంలో క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ, తిరుపతి, అమరావతిలో ఇందుకు అవసరమైన వసతులు కల్పిస్తున్నామన్నారు. అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు ఉద్యోగం, స్థలం, కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు తెలిపారు. బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్ ఏర్పాటు చేసిన అకాడమీ ద్వారా ప్రపంచంలో 50 శాతం మంది క్రీడాకారులను తీర్చిదిద్దారన్నారు. రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకునేందుకు అనేక కుతంత్రాలు పన్నారని గుర్తు చేశారు. పట్టిసీమ రాకుండా అడ్డుపడ్డారన్నారు. నీటి పథకాలకు గండి కొడుతుండటంతో డ్రోన్‌ల ద్వారా నిఘా ఏర్పాటు చేశామన్నారు. గోదావరి నీళ్లను పెన్నాకు, సోమశిలకు తరలించే అలోచన ఉందన్నారు. స్మార్ట్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 6 లక్షల పంటకుంటలను తవ్వడం ద్వారా భూమినే జలాశయంగా మార్చామన్నారు. తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి భద్రతపై దృష్టి సారించామన్నారు. నీటి వలన సుస్థిర అభివృద్ధి ఉంటుందన్నారు. వ్యవసాయం నుంచి ఉద్యాన పంటల వైపు రైతులను మళ్లిస్తున్నామన్నారు. దీని వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం లభిస్తుందన్నారు. డ్రోన్ ద్వారా భూసార పరీక్షలను చేపట్టనున్నామని, ఈ వివరాలను రియల్‌టైమ్‌లో రైతులకు తెలియచేస్తామన్నారు.

చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు