రాష్ట్రీయం

నేడే కాకినాడ కౌంటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 31: రాజకీయ పార్టీలు సహా అన్ని వర్గాలు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల ఫలితాలు శుక్రవారం తేటతెల్లం కానున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లమధ్య శుక్రవారం ఉదయం 8 గంటలకు స్థానిక రంగరాయ వైద్య కళాశాల ప్రాంగణంలో ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపునకు ఎన్నికల యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లుచేసింది. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఉదయం 11.30 గంటలకే ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. మధ్యాహ్నం 12గంటలకు లెక్కింపు ప్రక్రియ పూర్తికానుంది. కౌంటింగ్ హాలులో 14 టేబుల్స్ ఏర్పాటుచేశారు. ప్రతి టేబుల్‌కు ఒక రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించారు. ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించడానికి కౌంటింగ్ టేబుల్స్ వద్ద అభ్యర్థుల ఏజెంట్లు కూర్చోవడానికి అవసరమైన ఏర్పాట్లుచేశారు. పోలింగ్ జరిగిన మొత్తం 48 డివిజన్లకు గాను ప్రతి టేబుల్‌కు 3 డివిజన్ల చొప్పున ఓ రిటర్నింగ్ అధికారి పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహిస్తారు. ప్రతి డివిజన్‌కు 3 పోలింగ్ స్టేషన్ల వంతున ఏర్పాటుచేశారు. 12, 49 డివిజన్లకు 6 పోలింగ్ స్టేషన్ల చొప్పున ఏర్పాటుచేశారు. 3,8,6,23,27,33 డివిజన్లలో
5 పోలింగ్ స్టేషన్ల వంతున ఏర్పాటుచేశారు. ఉదయం 5 గంటలకు ఉద్యోగుల ర్యాండమైజేషన్‌ను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో చేపడతారు. ఉదయం 7 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూం తెరుస్తారు. కాగా కాకినాడ కార్పొరేషన్‌లో 50 డివిజన్లున్నాయి. కోర్టు వివాదాల కారణంగా 42, 48 డివిజన్లను ఎన్నికల నుండి మినహాయించారు. మిగిలిన 48 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. నగరంలో 2 లక్షల 29వేల 373 ఓటర్లకు గాను 1లక్ష 48వేల 598 మంది ఓటు హక్కు వినియోగించున్నారు. ఎన్నికల బరిలో 241 మంది నిలిచారు. వీరిలో టిడిపి నుండి 39 మంది, టిడిపి బలపరచిన బిజెపి అభ్యర్ధులు 9 మంది, వైపికి నుండి 48మంది, కాంగ్రెస్ నుండి 17మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.