రాష్ట్రీయం

కోర్టుకు రావలసిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: అక్రమాస్తుల కేసులో వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. సిబిఐ కోర్టుకు ప్రతి శుక్రవారం హాజరునుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టాలని వైకాపా అధ్యక్షుడు జగన్ నిర్ణయించిన విషయం విదితమే.
పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి జోక్యం చేసుకుని ‘పాదయాత్రను చేపడుతున్నట్లు పేర్కొని, కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరుతున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఆర్థిక నేరాల్లో జగన్ తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. గతంలో జగన్ కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌కు హైకోర్టు సమ్మతించింది. కాని ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలని కోర్టు పేర్కొన్న విషయం విదితమే. శుక్రవారం కూడా సిబిఐ కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని జగన్ సిబిఐ కోర్టును కోరారు. కాని ఈ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ప్రస్తుత పరిస్ధితుల్లో పాదయాత్ర చేస్తున్నానని పేర్కొని శుక్రవారం రోజు కూడా సిబిఐ కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరడాన్ని సమ్మతించమని హైకోర్టు పేర్కొంది. కాగా సెక్షన్ 205 సిఆర్‌పిసి కింద కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు ఇచ్చే అధికారం విచారణ కోర్టుకు ఉందని హైకోర్టు గుర్తు చేసింది. మినహాయింపునకు చట్టంలో ఎక్కడా ప్రత్యేక నిబంధన లేదని కోర్టు పేర్కొంది. దిగువ కోర్టుల్లో హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ సెక్షన్ 205 సిఆర్‌పిసి కింద అనేక పిటిషన్లు దాఖలుచేసిన విషయం హైకోర్టు దృష్టికి తీసుకురాలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.