రాష్ట్రీయం

‘డబుల్’ ధమాకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31:రాష్ట్రంలో మొత్తం 18వేల కోట్లతో 2లక్షల, 65వేల ఇళ్లను నిర్మించనున్నట్టు ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమాలతో పాటు, మల్కాజిగిరి పార్లమెంటు నియోజక వర్గంలో అభివృద్ధి పై సమీక్ష జరిపిన మంత్రి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంపై వివరించారు. ఇండ్లు లేని పేద వారు అందరికీ ఇండ్లు నిర్మించేంత వరకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం కొనసాగుతుందని చెప్పారు. 8500 కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చేయనున్నట్టు తెలిపారు. వచ్చే సంవత్సరం మొత్తం పేదవారు అందరూ డబుల్ బెడ్‌రూమ్ గృహ ప్రవేశాలతో బిజీగా ఉండాలని అన్నారు. హైదరాబాద్‌ను క్లీన్ అండ్ గ్రీన్ నగరంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు చెప్పారు. స్కైవే లాంటి ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నట్టు చెప్పారు. 20వేల కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్‌లో మార్పులు తీసుకు వస్తామని అన్నారు. ఈ పనులు చేసేందుకు కొంత సమయం పడుతుందని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎవరైనా లంచం అడిగితే తిరగబడాలని ప్రజలను కోరారు.
నగరం రూపురేఖలు మారుద్దాం
నగరం రూపురేఖలు మార్చడంలో అందరి కలిసి పని చేద్దామని కెటిఆర్ పిలుపు ఇచ్చారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజక వర్గంపై సమీక్ష జరిపారు. బేగంపేట మెట్రో రైలు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్లేందుకు కృషి చేయాలని అన్నారు. మల్కాజిగిరి నియోజక వర్గంలో సుమారు 40వేల ఇళ్ల నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు. మురికి వాడల్లో స్థలాలు ఇచ్చిన వారికి వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. గతంలో సుదూర ప్రాంతాల్లో ఇళ్లు కేటాయించే వారని ఇప్పుడు అలా కాకుండా సాధ్యమైనంత దగ్గరలోనే ఇళ్లును కేటాయించాలని అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలు సూచించారు. గతంలో కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, మిగిలిన వారికి అవకాశం కల్పించడంపై విధానపరంగా నిర్ణయం తీసుకోవాలని అన్నారు. నగరానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ప్రపంచ బ్యాంకు సహాయంతో మంచి నీటి సరఫరా పథకాలు చేపట్టినట్టు కెటిఆర్ తెలిపారు. బాలానగర్ వద్ద నిర్మించే ఫ్లై ఓవర్‌కు ఎలాంటి నిధుల కొరత లేదని చెప్పారు. స్కైవేల నిర్మాణం కోసం కేంద్రం నుంచి అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఉప్పల్, షామీర్‌పేట, కొంపల్లి స్కైవేలను నిర్మించనున్నట్టు కెటిఆర్ తెలిపారు. సమావేశంలో మంత్రి పి మహేందర్‌రెడ్డి, ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.