రాష్ట్రీయం

అసెంబ్లీ కార్యదర్శిగా వేదాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: శాసనసభ కార్యదర్శిగా వేదాంతం నరసింహాచార్యులను నియమించారు. ప్రస్తుత కార్యదర్శి రాజా సదారామ్ గురువారం పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో నరసింహాచార్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లా (జోగులాంబ జిల్లా) అలంపురం మండలంలోని క్యాతూరు గ్రామానికి చెందిన నరసింహాచార్యులు ప్రస్తుతం శాసనసభ సంయుక్త కార్యదర్శిగా వ్యవహరిస్తుండగా పదోన్నతి కల్పించి కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నరసింహాచార్యులు 1990లో రిసర్చ్ ఆఫీసర్‌గా శాసనసభలో నియామకం అయ్యారు. ఆ తర్వాత అసిస్టెంట్ సెక్రటరీగా, డిప్యూటీ సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా అంచెలంచెలుగా ఎదిగారు. అసెంబ్లీ కార్యదర్శిగా నియామకం కాగానే నరసింహాచార్యులు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిజేశారు. నరసింహాచార్యుల నియామకం పట్ల అలాగే ఆసెంబ్లీ మీడియా కమిటీ ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపింది.