రాష్ట్రీయం

రద్దీ నివారణకు ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 31: ప్రయాణీకుల అధిక రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే కొన్ని రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా, మరికొన్ని రూట్లలో ప్రత్యేక చార్జీలతో కూడిన ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. బెంగళూరు కంటోనె్మంట్-హౌరా-బెంగళూరు కంటోనె్మంట్ మధ్య సూపర్‌ఫాస్ట్ రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 1న బెంగళూరు కంటోనె్మంట్ నుంచి ప్రత్యేక రైలు బయలుదేరుతుండగా, తిరుగు ప్రయాణంలో హౌరా నుంచి సెప్టెంబర్ 5న బయలు దేరుతుంది. ఈ రైలుకు ఫస్ట్ ఏసి, ఎసి టు టైర్, ఎసి 3 టైర్ బోగీలు ఉంటాయని తెలిపింది. అలాగే హౌరా-త్రివేండ్రమ్ సెంట్రల్-హౌరా మధ్య రెండు సర్వీసులను నడుపుతున్నట్లు తెలిపింది.
సెప్టెంబర్ 2న హౌరా నుంచి బయలుదేరుతుండగా, తిరుగు ప్రయాణంలో త్రివేండ్రమ్ సెంట్రల్ నుంచి సెప్టెంబర్ 5న బయలుదేరుతుంది. ఈ రైలుకు ఎసి ఫస్ట్ క్లాస్, ఎసి 2 టైర్, ఎసి 3 టైర్, స్లీపర్ క్లాస్, సెకండ్ క్లాస్ జనరల్ బోగీలు ఉంటాయని స్పష్టం చేసింది. యశ్వంత్‌పూర్-హౌరా మధ్య ప్రత్యేక చార్జీలతో సెప్టెంబర్ 2న ప్రత్యేక రైలు బయలుదేరుతుండగా, హౌరా-బెంగళూరు కంటోనె్మంట్ మధ్య ప్రత్యేక చార్జీలతో సెప్టెంబర్6న బయలుదేరుతుంది. మాల్దా టౌన్ నుంచి బెంగళూరు కంటోనె్మంట్ వరకు సెప్టెంబర్ 3న మరో ప్రత్యేక చార్జీలతో కూడిన రైలు బయలుదేరుతుందని రైల్వే వెల్లడించింది.