రాష్ట్రీయం

కేసిఆర్ మానస పుత్రిక హరితహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇల్లందు, ఆగస్టు 31: ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రిక హరిహారం అని రాష్ట్ర మంత్రులు జోగు రామన్న, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లచ్చగూడెంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో తెలంగాణలో 230 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా ప్రభు త్వం నిర్దేశించిందన్నారు. అందులో భాగంగానే తొలి విడతలో 16 కోట్లు, రెండో విడతలో 32 కోట్లు, మూడవ విడతలో ఇప్పటి వరకు 26 కోట్లకు పైగా మొక్కలు నాటామన్నారు. రానున్న కాలంలో లక్ష్యాన్ని అధిగమించేందుకు కృషి చేయాలని కోరారు. లచ్చగూడెం ప్రాంతంలోని 47 ఎకరాల్లో లక్ష మొక్కలు నాటాలని సూచించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి ప్రతిపక్షాలకు చెందిన నాయకులు ఓర్వ లేకపోతున్నారని రాష్ట్ర మంత్రులు ప్రతిపక్ష పార్టీల నేతలపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న సిఎంను ఢీకొనే నేతలు ఎవరూ లేరని, భవిష్యత్‌లో రారని మంత్రులు అన్నారు. మిషన్ కాకతీయ, భగీరథ వంటి పథకాలు దేశంలోనే ఖ్యాతి గడించాయని అన్నారు.

చిత్రం..కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి జోగు రామన్న