రాష్ట్రీయం

కేంద్రీకృత అభివృద్ధితో మళ్లీ విభజన ఉద్యమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమండ్రి, నవంబర్ 27: రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని చుట్టూనే అభివృద్ధిని కేంద్రీకృతం చేస్తోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. ఈ విధానాల వల్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలో మరోసారి విభజన ఉద్యమాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. రాజమండ్రిలో శుక్రవారం జరిగిన రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై సదస్సులో రాఘవులు మాట్లాడారు. రాష్ట్రం విద్యాపరంగా ఎంతో వెనుకబడి ఉందని, విద్యాపరంగా ప్రగతి సాధిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని హితవు పలికారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు ఇప్పటికీ వెనుబడి ఉన్నాయన్నారు. అలాగే విలీన మండలాల్లో కూడా అభివృద్ధి లేదన్నారు. కోస్తా జిల్లాలు స్వాతంత్య్రానికి పూర్వమే అభివృద్ధి చెందాయని, ఆ తరువాత అభివృద్ధి జరగలేదన్నారు. ఈనేపథ్యంలో రాజధాని చుట్టూనే అభివృద్ధి కేంద్రీకృతమైతే మరోసారి విభజన ఉద్యమాలు వచ్చే అవకాశం ఉందన్నారు. 40-50 అంతస్తుల భవనాలు నిర్మిస్తే అభివృద్ధి సాధ్యం కాదన్నారు. గోల్కోండ, చార్మినార్ వంటి కట్టడాలు ఉన్న తెలంగాణ ఎందుకు వెనుకబడి ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అభివృద్ధి పేరిట తీరప్రాంత మత్స్యకారులను కూడా ఖాళీ చేయిస్తున్నారన్నారు. రాజధాని అభివృద్ధిని విదేశీయుల చేతుల్లో పెట్టడం వల్ల రాష్ట్ర సంపద విదేశాలకు తరలిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం వినోపరంగా అభివృద్ధి సాధిస్తోంది తప్ప, పారిశ్రామికంగా కాదన్నారు.