రాష్ట్రీయం

హీరో నిఖిల్‌కు తప్పిన ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 2: సినీ హీరో నిఖిల్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. గుంటూరు నగరంలోని చంద్రవౌళినగర్‌లో ఓ ప్రైవేటు వ్యాయామశాల (జిమ్) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యేందుకు శనివారం నిఖిల్ గుంటూరు చేరుకున్నారు. ఐదంతస్తుల భవనంలోని నాలుగో ఫ్లోర్‌లో జిమ్ ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేశారు. లిఫ్టు నాలుగో ఫ్లోర్‌కు చేరుకునే సమయంలో సాంకేతికలోపం కారణంగా ఉన్నట్టుండి ఆగిపోయింది. జిమ్ నిర్వాహకులు.. అభిమానులు.. ఆయన సన్నిహితులు ఆందోళనకు గురయ్యారు.. సుమారు అరగంటకు పైగా ఆయన లిఫ్టులో ఆందోళనతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇంతలో ఆయన బాడీ గార్డులు లిఫ్టుకు ఉన్న ఇనుప ఊచలను తొలగించి నిఖిల్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సురక్షితంగా వెలుపలికి తీసుకురావటంతో ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరై తిరిగి పయనమయ్యారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

చిత్రం..లిఫ్టులో చిక్కుకున్న హీరో నిఖిల్