రాష్ట్రీయం

టీచర్లను సొంత రాష్ట్రాలకు పంపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/చార్మినార్, సెప్టెంబర్ 2: రెండు తెలుగు రాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులను వారి సొంత రాష్ట్రాలకు పంపాలని జాతీయ బిసి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరారు. ఇందుకు అవసరమైతే రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో తాను చర్చిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉద్యోగాలున్నా, ఉద్యోగ తృప్తి లేకుండా పోయిందని వాపోయారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 667 మంది ఉపాధ్యాయులను, తెలంగాణకు చెందిన 300 మంది ఉపాధ్యాయులను వారివారి సొంత స్థలాలకు పంపేందుకు రాజ్యాంగపరంగా ఎలాంటి సమస్యలు ఎదురుకావని, రాజ్యాంగంలో ఎలాంటి సవరణలు అవసరం లేదని, ఇందుకు కనీసం పార్లమెంటులో బిల్లు కూడా పెట్టే అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో 30వేల పోస్టులున్నాయని, వాటిని భర్తీ చేయాలంటే ఇరురాష్ట్రాలు ఉపాధ్యాయులను వారి సొంత స్థలాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేసిన తర్వాతే పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఇరురాష్ట్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న నాన్‌లోకల్ ఉపాధ్యాయుల సమస్య పరిష్కారమయ్యే వరకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం బిసి జాబితా నుంచి 26 కులాలను తొలగించిందని, అదే ఆంధ్రప్రదేశ్ సదరు కులాలు బిసి జాబితాలో ఉండటం వల్ల ఈ సమస్య తలెత్తిందన్నారు. దీని వల్ల నాన్‌లోకల్ ఉపాధ్యాయుల పిల్లలకు విద్యా, ఉద్యోగాల పరంగా కూడా తీవ్ర నష్టమేర్పడే అవకాశముందని వివరించారు. ఉపాధ్యాయుల తల్లిదండ్రులు తమ స్వస్థలాల్లో ఉండటం వల్ల కనీసం వారి గురించి కూడా పట్టించుకోవటం వారికి గగనంగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయుల్లో కొందరికి హెల్త్‌కార్డులు తెలంగాణ ప్రభుత్వమిచ్చినవి ఉన్నాయని, అవి ఆంధ్రప్రదేశ్‌లో ఉపయోగపడటం లేదన్నారు.

చిత్రం..నాన్‌లోకల్ ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతున్న జాతీయ బిసి సంఘం
వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య