రాష్ట్రీయం

మనమే నెంబర్ 1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 3: ఎల్‌ఇడి బల్బుల వినియోగంలో ప్రపంచంలో నెంబర్-1గా నిలవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. మున్సిపల్ ప్రాంతాల్లో ఈ బల్బుల వినియోగం ద్వారా ఇప్పటికే 133 మిలియన్ల యూనిట్ల విద్యుత్ ఆదా అవుతోందని తెలిపారు. ఎల్‌ఇడి బల్బుల వినియోగం వల్ల విద్యుత్ ఆదా, తదితర అంశాలపై శాస్ర్తియ అధ్యయనం చేయాలని సూచించారు.
రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎల్‌ఇడి వీధిదీపాల అమరికపై పంచాయతీరాజ్, పురపాలక, ఇంధన శాఖ మంత్రులు నారా లోకేష్, నారాయణ, కళావెంకటరావు, ఆయా శాఖల అధికారులతో ఉండవల్లిలోని తన నివాసం నుంచి ముఖ్యమంత్రి ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హుదూద్ తుపానుతో అతలాకుతలమైన విశాఖ నగరానికి ఎల్‌ఇడి వీధిదీపాలతో కొత్త శోభను తెచ్చామన్నారు. కార్బన్ ఉద్గారాలను వెదజల్లే బల్బుల స్థానంలో ఎల్‌ఇడి దీపాలు ఏర్పాటు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టామని చెప్పారు. జాతీయ రహదారుల్లోనూ ఎల్‌ఇడి దీపాలను అమర్చాలన్న స్ఫూర్తిని ఇది నింపిందన్నారు. విద్యుత్ ఆదా దిశగా రాష్ట్రం వేసిన తొలి అడుగు దేశాన్ని ఆశ్చర్యపరించిందని చంద్రబాబు గుర్తుచేశారు. దీంతో అప్పటిదాకా ఆకాశంలో ఉన్న ఎల్‌ఇడి బల్బుల ధరలు దిగివచ్చాయన్నారు. ఎల్‌ఇడి వినియోగంలో ప్రపంచ చిత్రపటంలో విశాఖకు ప్రత్యేక స్థానం కల్పించామన్నారు. రాష్ట్రంలోని గ్రామాల్లో 40 లక్షల ఎల్‌ఇడి బల్బులు అమర్చడం ద్వారా ఆహ్లాదకరమైన కొత్త వెలుగులు నింపడమే కాకుండా, పంచాయతీలకు విద్యుత్ బిల్లుల భారం నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో ఎల్‌ఇడి విద్యుత్ బల్బుల వినియోగం వల్ల దాదాపు 669కోట్ల రూపాయలను ఆదా చేయగలిగామన్నారు. మున్సిపల్ ప్రాంతాల్లో ఎల్‌ఇడి బల్బుల ద్వారా 133 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతోందని తెలిపారు. ఈ బల్బులను అమర్చడం ద్వారా ఎంతమేర విద్యుత్ ఆదా అవుతుందో శాస్ర్తియంగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో కాలిఫోర్నియా కంటే మన రాష్ట్రం ముందుందన్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వినియోగంలో ఏప్రిల్ నుంచి జూలై వరకూ 11శాతం వృద్ధి సాధించామన్నారు. గ్రీన్ ఎనర్జీలో ఎపి ముందంజలో ఉందనడానికి ఇదే నిదర్శమని చంద్రబాబు వివరించారు. గ్రామాల్లో ఎల్‌ఇడి బల్బుల ఏర్పాటును వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఎల్‌ఇడి బల్బుల ఏర్పాటుకు ఫ్రాన్స్‌కు చెందిన ఎఎస్‌డి బ్యాంక్ రూ. వెయ్యి కోట్ల మేర ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ముఖ్యమంత్రికి తెలిపారు. తొలిదశలో 5 జిల్లాల్లో 10 లక్షల ఎల్‌ఇడి బల్బులు అమర్చుతున్నట్లు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా, మండల స్థాయిల్లో కమిటీలు వేయనున్నట్లు ఆయన వివరించారు.