రాష్ట్రీయం

సాగర్‌కు నీరివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 5: శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చిన స్వల్ప వరద నీటి ప్రవాహంతో నీటిమట్టం 800అడుగులకు చేరడం, దాదాపు 30.66టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోవడంతో మంచి నీటి అవసరాలకు నాగార్జునసాగర్‌కు నీరు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరనుంది. ఈ విషయమై కృష్ణా బోర్డుకు నేడో, రేపో లేఖ రాయనుంది. శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఈ ప్రాజెక్టులో నీటి మట్టం 854 అడగులు వచ్చే వరకు నీటిని దిగువకు విడుదల చేయరాదని రాయలసీమ నేతలు ఏపి ప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. 854 అడగుల వద్ద మాత్రమే పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమకు నీరందుతుంది. వాస్తవానికి శ్రీశైలం ప్రాజెక్టుకు గత వారం రోజుల్లో చెప్పుకోదగిన ప్రవాహం ఏమీ రాలేదు. ప్రస్తుతం 215 టిఎంసిలకి కేవలం 30టిఎంసిల నీరు మాత్రమే లభ్యత ఉంది. 800 అడుగుల వద్ద దిగువకు ఒకటి రెండు టిఎంసిల నీటిని విడుదల చేస్తే నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లా మంచినీటి అవసరాలను తీర్చవచ్చు. ప్రస్తుతం శ్రీశైలంకు ఎనిమిది వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఆల్మట్టి నుంచి దిగువకు 19023 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. నారాయణపూర్ నుంచి 17703 క్యూసెక్కులు, ఉజ్జయిని ప్రాజెక్టు నుంచి 5774 క్యూసెక్కులు, జూరాల నుంచి 43వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు మంగళవారం కూడా 40వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరింది. గత రెండు రోజుల క్రితం ఆల్మట్టి నుంచి 50 వేల క్యూసెక్కుల నీరు వస్తే, ఈ రోజు 19 వేల క్యూసెక్కులకు పడిపోయింది. ఇది నిరాశకలిగించే విషయమని సాగునీటి నిపుణులు తెలిపారు. ఎగువ కృష్ణా బేసిన్‌లో భారీ వర్షాలు గత రెండు రోజులుగా తగ్గాయి. ఈ సీజన్‌లో జూరాలకు 8 టిఎంసి నీరు వచ్చింది. తుంగభద్ర నుంచి ఆశించిన నీటి ప్రవాహం శ్రీశైలంకు ఈ ఏడాది ఇంతవరకురాలేదు. సాధారణంగా ప్రతి సీజన్‌లో కనీసం 50 టిఎంసి నీరు తుంగభద్ర ద్వారా శ్రీశైలంకు వచ్చేది. ప్రస్తుతం 30 టిఎంసి నీటి లభ్యత ఉన్నా, దిగువకు వదిలితే రాయలసీమ రైతులకు ఆగ్రహం వస్తుంది. అక్టోబర్ వరకు వచ్చేవర్షాల వల్ల నీటి మట్టం 854 అడుగులకు చేరుతుందని ఏపి ప్రభుత్వం ఆశిస్తోంది. కాని ఏదో అద్భుతం జరిగితే తప్ప వర్ష రుతువు దాదాపు ముగింపుదశకు వచ్చింది. ఈ పరిస్ధితుల్లో రాయలసీమకు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని ఇవ్వడం అసాధ్యం. ఈ పరిస్ధితులను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లా ప్రజల మంచినీటి అవసరాలకు కనీసం దశలవారీగా మంచినీటిని విడుదల చేయాలని కృష్ణాబోర్డును, కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరనుంది.