రాష్ట్రీయం

గోదారి గట్టుపై మళ్లీ ఇసుక దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 5: వరద సీజను డిమాండును దృష్టిలో ఉంచుకుని ఇసుక ధరలను అమాంతం పెంచేశారు. గోదావరి నది ఇసుకకు శ్రేష్ఠమైనదిగా నిర్మాణ రంగంలో పేరుంది. గోదావరి నది వరద పోటుతో ఉండటంతో ప్రస్తుతం చాలా ర్యాంపుల్లో ఇసుక తీసేందుకు అనుమతిలేదు. రాజమహేంద్రవరం పరిధిలోని రెండు ర్యాంపుల్లోనే అనుమతి వుంది.వరద కాలాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దఎత్తున ఇసుక నిల్వలు పెట్టుకున్న మాఫియా డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, కృత్రిమ కొరత సృష్టించి, ఇసుక ధరలను అమాంతం పెంచేశారు. నిబంధనలకు విరుద్ధంగా గోదావరి నది కుడి గట్టు వైపు చాలా చోట్ల అక్రమంగా ఇసుకనుతీస్తూ దూర ప్రాంతాలకు పెద్ద ఎత్తున తరలిస్తున్నారని తెలుస్తోంది. గోదావరి జిల్లాల్లోని నదీ ప్రాంతంలో మరెక్కడా శాఖాపరంగా ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. అయితే ఇతర ప్రాంతాల నుంచి భారీ టిప్పర్లపై తీసుకొచ్చిన ఇసుక రాజమహేంద్రవరంలో నిర్దేశించిన రెండు ర్యాంపుల్లో దిగుమతిచేసి, అక్కడ నుంచి నావల నుంచి తీసినట్టు మళ్లీ లారీలకు ఎగుమతిచేసి, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ మేరకు రెండు యూనిట్ల ఇసుక లారీ రూ.4000కు అమ్మకం సాగిస్తున్నట్టు తెలిసింది. మాఫియా చేతిలో లారీలు, నావలను పెట్టుకుని, బోగస్ సొసైటీ పేరుతో ఇసుక వ్యాపారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. నదిలో ఇసుక తీసి నావలపై బయటకు తేవడానికి కూలీలకు లారీ ఇసుకకు రూ.700, నావ అద్దెకు రూ.300లు, లారీ కిరాయి రూ.1000 చొప్పున ఖర్చవుతోంది. కానీ మాఫియా రూ.4000వేల చొప్పున అమ్మకాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు మాఫియా ప్రమేయం లేకుండా ఉంటే రెండు యూనిట్ల ఇసుక కేవలం రూ.1800లకే లభించే అవకాశం వుంటుంది. జట్టు కూలీలు ఒక్కో నావకు ఆరుగురు వుంటారు. ఒక్కొక్క జట్టు ఆరు లారీల ఇసుక తీస్తారు. అంటే ఒక్కో కూలీకి రూ.700 కూలీ దక్కుతుంది. మిగిలిన లాభమంతా మాఫియా చేతిలోనే వుంటుంది. గోదావరి జిల్లాల్లో మొత్తం 23 ఇసుక ర్యాంపులు వున్నాయి. ఇందులో మూడు ర్యాంపులు డీ సిల్టేషన్ ర్యాంపులు కాగా మరో మూడుచోట్ల పట్టా భూముల ఇసుక ర్యాంపులు వున్నాయి. కానీ ప్రస్తుతం 23 ర్యాంపులకు అనుమతిలేదు. కానీ అక్కడక్కడ ఇసుక అక్రమ రవాణా జరిగిపోతోంది. డీసిల్టేషన్ ర్యాంపుల్లో రాజమహేంద్రవరంలోని కేతావారిలంక, బ్రిడ్జిలంక ప్రాంతాల్లోనే అనుమతి ఉండటంతో ఈ రెండు ర్యాంపుల్లో ఇసుక ధరలు మాఫియా అధికంగా పెంచేసింది. ఇసుక డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇసుక బస్తాల రూపంలో తరలించుకుపోతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఏజెన్సీ మార్గాల్లో ఇసుకను తరలిస్తున్నారు. డ్రెడ్జింగ్ ద్వారా లభించే ఇసుకైనా అందుబాటులో ఉంటే ధరలు కాస్తంత అదుపులో ఉంటాయని చెబుతున్నారు. అధికారులను మాఫియా కట్టడి చేయడంవల్లే డ్రెడ్జింగ్ ఇసుక కూడా లేకుండా చేశారని ఆరోపణలు కూడా చోటు చేసుకున్నాయి. ఏదేమైనప్పటికీ ఇసుక ఉచితంగా లభించే విధంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులపై వుంది.