ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో దక్షిణాది రాష్ట్రాల గ్రీన్ ట్రిబ్యునల్ కాన్ఫరెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 5: దక్షిణాది రాష్ట్రాల గ్రీన్ ట్రిబ్యునల్ సదస్సు ఈ నెల 15,16 తేదీల్లో విశాఖలో జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రలో ఒకే వేదికపైకి రావడం ఇది రెండో సారి. నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో ఇద్దరు సిఎంలు ఒకే వేదికపై కన్పించారు. రెండున్నరేళ్ల అనంతరం తిరిగి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ సదస్సులో పాల్గొంటున్నారు. విశాఖ శివారు మధురవాడ వైజాగ్ కనె్వన్షన్ సెంటర్‌లో సెప్టెంబర్ 15న సదస్సు ప్రారంభం అవుతుంది. పర్యావరణం తదితర రంగాల్లో నిష్ణాతులైన సుమారు 400 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. పోర్టులు, బల్క్‌డ్రగ్ కర్మాగారాల వల్ల వెలువడుతున్న కాలుష్యం, తీర నియంత్రణ మండలి నిబంధనల ఉల్లంఘన తదితర అంశాలపై పలువురు ప్రసంగించనున్నారు.