రాష్ట్రీయం

పథకాలే గెలిపిస్తాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10:రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. ప్రధాన రాజకీయ పక్షాలు ముందుగానే ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం అవుతున్నాయి. పథకాలే ఎన్నికల్లో గెలిపిస్తాయి అని అధికార పక్షం ధీమాగా ఉండగా, కాంగ్రెస్ జనంలోకి వెళ్లడానికి సిద్ధమవుతోంది. ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకున్నా ముందు చూపుతూ అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. టిఆర్‌ఎస్ తన పథకాలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంలో హఠాత్తుగా వేగం పెంచారు. ఏడాది లోపు రెండున్నర లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల వేగం పెంచారు. ఆసరా పెన్షన్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాల జనంలోకి బాగా వెళ్లాయని వీటి ప్రయోజనం ఉంటుందని, పార్టీ నిర్వహించిన సర్వేల్లో తేలినట్టు టిఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. నియోజక వర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలపై అసంతృప్తి ఉన్నా పథకాలే పార్టీని గెలిపిస్తాయి అనే ధీమా అధికార పక్షంలో ఉంది. వీటికి తోడు వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ అందించడంతో పాటు ఎకరానికి ఏటా ఎనిమిదివేల రూపాయల వరకు పెట్టుబడి సహాయం అందించాలనే నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో టిఆర్‌ఎస్‌కు ఎదురు లేకుండా పోయిందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ప్రభావం మరో ఏడాదిలో స్పష్టంగా కనిపిస్తుందని మంత్రులు తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలిగినట్టు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు కూడా ఎన్నికలకు ముందే రైతులకు అందనున్నాయని ప్రభుత్వం ధీమాగా ఉంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేదని, దీనిపై జనంలోకి వెళతామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అధికార పక్షాన్ని విమర్శించేందుకు కాంగ్రెస్‌కు ఎలాంటి ఇష్యూ లేదు అనేది టిఆర్‌ఎస్ వాదన. ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేయడం మినహా కాంగ్రెస్ ప్రతిపక్షంగా
సాధించింది ఏమీ లేదని, ఇదే విషయాన్ని జనంలోకి తీసుకు వెళతామని టిఆర్‌ఎస్ ప్రకటించింది.
గతంలో టిఆర్‌ఎస్ బలహీనంగా ఉన్న హైదరాబాద్, ఖమ్మం లాంటి జిల్లాల్లో సైతం ఇతర పార్టీల నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని ప్రాంతాల్లోనూ బలపడినట్టు ఆయా జిల్లాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో తేలింది.
కాంగ్రెస్ పార్టీ శిక్షణ కార్యక్రమాల ద్వారా పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తోంది. కాంగ్రెస్‌లోని బహు నాయకత్వం ఆ పార్టీకి ఇబ్బంది కరంగా మారింది. చివరకు శిక్షణ కార్యక్రమాల్లో సైతం పార్టీలోని విబేధాలు బయటపడ్డాయి. పిసిసి అధ్యక్షుడు, సిఎల్‌పి నాయకులు పాత నల్లగొండ జిల్లాకు చెందిన వారే కాగా, అదే జిల్లా నుంచి వీరి నాయకత్వానికి కోమటిరెడ్డి బ్రదర్స్ సవాల్ విసురుతున్నారు. ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల హామీని నెరవేర్చలేదని, దళితులకు మూడేకరాల భూమి పంపిణీ, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య హామీలను అమలు చేయలేదని, వీటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. రెడ్డి సామాజిక వర్గానికి రాజ్యాధికారం అనే అంశంపై కాంగ్రెస్ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణలో టిడిపి పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారింది. టిడిపి అంటే రేవంత్‌రెడ్డి ఒక్కరే అన్నట్టుగా తెలంగాణలో పార్టీ పరిస్థితి ఉంది. ఉన్న ఒక్క కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలకడం బిజెపి శ్రేణులకు నిరాశ కలిగించింది. ఇక కోదండరామ్ కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో నాన్చివేత దోరణితో మాట్లాడుతున్నారు.