రాష్ట్రీయం

అసైన్డ్ లెక్క తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: భూమిలేని దళితులకు ఉచితంగా మూడు ఎకరాల వ్యవసాయ భూమి పంపిణీ చేయడానికి భూ కొరత ఏర్పడింది. రాష్టవ్య్రాప్తంగా అసైన్డ్ ల్యాండ్ ఇంకా ఎంత మేరకు అందుబాటులో ఉందో లెక్క తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దళితులకు ఇప్పటికే పంపిణీ చేసిన అసైన్డ్‌ల్యాండ్ వినియోగం, నిరూపయోగంపై సర్వే చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఎస్‌సి సంక్షేమ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. అసైన్డ్ ల్యాండ్ పొందిన లబ్ధిదారులు చాలా మటుకు సాగు చేయడానికి నీటి వసతి లేకపోవడంతో నిరూపయోగంగా మిగిలాయి. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన భూ పంపిణీ కేవలం కాగితాలకే పరిమితం కావడంతో వాటిని వినియోగంలోకి తీసుకరావడానికి నీటి వసతి కల్పించాలని ప్రభుత్వం యోచిస్తుంది. కాంగ్రెస్ హయాంలో అసైన్డ్ ల్యాండ్ కలిగిన లబ్ధిదారులకు సాగునీటి వసతి కల్పించడానికి ఇందిరా ప్రభ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ సరిగా అమలుకు నోచుకోలేదు. అసైన్డ్ ల్యాండ్ పొందిన లబ్ధిదారులకు సాగునీటి వసతి కల్పించడంతో పాటు మిగిలిన అసైన్డ్ ల్యాండ్ లెక్కలు తేలితే భూమి లేని దళితులకు పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుందని ఎస్‌సి సంక్షేమ శాఖ భావిస్తుంది. ఒకవైపు భూ ప్రక్షాళనలో భాగంగా జరుగనున్న సర్వేలో అసైన్డ్ ల్యాండ్‌ల లెక్క తేలితే వచ్చే ఏడాది పెద్ద ఎత్తున దళితులకు భూ పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.