రాష్ట్రీయం

వైద్యుల నిర్లక్ష్యానికి చిన్నారి బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 10: రోగికి ఆపరేషన్ చేసి కుట్లు వేయకుండా ఇంటికి పంపిన సంఘటనను మరువకముందే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మరో ఘోరం జరిగింది. వైద్యులు, సిబ్బంది మానవత్వానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించారంటూ దీనిపై నిరసనలు వ్యక్తమయ్యాయి. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం గ్రామానికి చెందిన రాజయ్య సతీమణి నాగమణి పురిటినొప్పులతో శనివారం సాయంత్రం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. అయితే ఇంకా నెలలు నిండలేదని చెబుతూ వైద్యులు ఆమెను ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు. చేసేదేమీ లేక వెనుదిరిగిన నాగమణి అలసటతో ఆసుపత్రి ప్రాంగణంలోనే ఓ బల్లపై సేదదీరింది. పురిటినొప్పులు తీవ్రం కావడంతో తట్టుకోలేకపోయింది. అయినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది కనికరించలేదు. చివరకు బల్లపైనే ఆమె ప్రసవించింది. పుట్టిన వెంటనే బల్లపై నుంచి కిందపడిపోవటంతో చిన్నారి మృతి చెందాడు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని బాధితురాలు, ఆసుపత్రిలోని రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఈ దుర్ఘటన జరగడం గమనార్హం. ఈ దుర్ఘటనపై రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా వ్యవహరిస్తున్న వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. వెంటనే విచారణ జరపాలని కలెక్టర్ లోకేష్‌కుమార్‌ను ఆదేశించారు. వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది తమ విధానాలు మార్చుకోకపోతే చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు.