రాష్ట్రీయం

సృజనకు 100 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 11: రాష్ట్రంలో నూతన ఆవిష్కరణల (ఇన్నోవేషన్స్)ను ప్రోత్సహించేందుకు వంద కోట్లు కేటాయిస్తున్నట్టు సిఎం చంద్రబాబు ప్రకటించారు. ఏషియా పసిఫిక్ సెంటర్ ఫర్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టెక్నాలజీ, ఏపి ఇన్నోవేషన్ సొసైటీ, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇనె్వస్టర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్-2017ను మూడు రోజులపాటు విశాఖలో నిర్వహించింది. సోమవారం ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలకు మంచి భవిష్యత్ ఉందన్నారు. ఆవిష్కరణలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆ సాంకేతిక పరిజ్ఞానంతో పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు తమ ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందిస్తుందన్నారు. నూతన ఆవిష్కరణలు చూడ్డానికి చిన్నవిగా కనిపించినా, వాటి వలన అధిక ప్రయోజనాలు ఉంటాయన్నారు. నూతన ఆవిష్కరణలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. విశాఖలో జరిగిన ఇన్నోవేటివ్ ఎగ్జిబిషన్‌లో ఏడవ తరగతి తప్పిన విద్యార్థి కూడా కొత్త ఆవిష్కరణ చేయడాన్ని చూస్తే ఆశ్చర్యం కలిగిందన్నారు. నూతన ఆవిష్కరణలకు వయసుతో పనిలేదంటూనే, తనెప్పుడూ కొత్తగా ఆలోచిస్తుంటానని, ఆ ఆలోచనలు సామా న్య ప్రజలకు, రాష్ట్రానికి, దేశానికి ప్రయోజనకారిగా ఉండాలని కోరుకుంటుంటానని చంద్రబాబు అన్నారు. గతంలో సిఎంగా ఉన్నప్పుడు ఐటి రంగాన్ని ప్రోత్సహించడం వల్లే సైబరాబాద్ ఏర్పడిందన్నారు. ప్రస్తుతం బయోమెట్రిక్, సెన్సార్స్, డ్రోన్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ అద్భుత ఫలితాలు రాబడుతున్నామని తెలిపారు. నూతన ఆవిష్కరణలతో కూడిన ఎగ్జిబిషన్స్ ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయ డం వలన విద్యార్థులు స్ఫూర్తిని పొందుతారన్నారు. నూతన ఆవిష్కరణలు చేసిన విద్యార్థులు కేవలం
ఉద్యోగాలకే పరిమితం కాకుండా, పారిశ్రామికవేత్తలుగా మారారని అన్నారు. ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానంద్ మాట్లాడుతూ ఈ ఏడాది ఇన్నోవేటివ్ ఫెయిర్‌ను ఏపిలో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. 30 దేశాల నుంచి 300 నమూనాలను ప్రదర్శనలో ఉంచామన్నారు. మూడు రోజుల్లో పది వేల మంది ప్రదర్శనను తిలకించారని వివరించారు. ఐఐఎ అధ్యక్షుడు ఎఎస్ రావు మాట్లాడుతూ విశాఖలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫెయిర్‌కు ప్రపంచంలోని వంద దేశాల్లో పబ్లిసిటీ లభించిందన్నారు. త్వరలోనే ఇంటర్నేషనల్ టెక్నాలజీ బజార్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కేవలం సెల్ ఫోన్ ద్వారానే 40 వేల టెక్నాలజీల గురించి తెలుసుకునేందుకు వీలుంటుందన్నారు. ఏషియా ఫసిఫిక్ సెంటర్ ఫర్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టెక్నాలజీ సిఇఓ మిచికో ఇనమోటివ్ మాట్లాడుతూ విశాఖలో జరిగిన ప్రదర్శనకు సిసలైన నూతన ఆవిష్కరణలు వచ్చాయన్నారు. నూతన ఆవిష్కరణలకు ఏపి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం అద్భుతంగా ఉందన్నారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇనె్వస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అలిజెరే రాస్టేగర్ మాట్లాడుతూ గతంలో ఇటువంటి ప్రదర్శనలు చాలా నిర్వహించామని, ఎక్కడా దక్కని గౌరవం, ప్రోత్సాహం ఏపిలో లభించిందన్నారు. ప్రతిభను ప్రజలకు పరిచయం చేయడం తమ లక్ష్యమని వివరించారు. ఏటా ప్రదర్శనను ఏపీలో నిర్వహించాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. సరికొత్త ఆవిష్కరణలతో సాంకేతిక పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందుతుందని, దీనివలన చైనా, భారత్‌ల మధ్య వాణిజ్య బంధం మరింత బలపడుతుందని అలిజెరే రాస్టేగర్ అన్నారు. నూతన ఆవిష్కరణల ద్వారా స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ఏపి ఇన్నోవేషన్ సొసైటీ, నేషనల్ రిసెర్చ్ డవలప్‌మెంట్ సెంటర్ మధ్య ఒప్పందం కుదిరింది. సిఎం సమక్షంలో సంబంధిత అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, లోకేష్, ఎంపిలు అవంతి శ్రీనివాసరావు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్ ముగింపు సమావేశంలో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు