రాష్ట్రీయం

ఏసీబీ వలలో తూనికల చేప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 11: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన తూనికలు, కొలతల శాఖ కర్నూలు జిల్లా ఇన్‌స్పెక్టర్ ఎన్ స్వామి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోమవారం ఏకకాలంలో దాడులు జరిపారు. సుమారు రూ.10 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. స్వామి కర్నూలు జిల్లా తూనికలు, కొలతలశాఖ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. కుటుంబం మొత్తం
హైదరాబాద్‌లో ఉంటోంది. ఆయన ఆదాయానికి మంచి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో కర్నూలు అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ విజయరామరాజు ఆధ్వర్యంలో 4 బృందాలు ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ, విజయవాడలోని అతడి బంధువుల ఇళ్లపైనా దాడులు నిర్వహించి లెక్కకు మించిన విలువైన ఆస్తులను గుర్తించారు. హైదరాబాదు ఎర్రగడ్డలో 4 అంతస్తుల ఇళ్లు 2, ఇంటిస్థలాలు 5, విజయవాడలో ఫ్లాట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కారుతోపాటు రూ.18 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని ఏసీబీ డిఎస్పీ విజయరామారాజు తెలిపారు. సోదాలు కొనసాగుతూనే ఉన్నాయని వివరించారు.