రాష్ట్రీయం

వంద రోజుల్లో 28 ప్రాజెక్టులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 11: మరో 100 రోజుల్లో 28 ప్రాజెక్టులు పూర్తిచేయడం రాష్ట్ర చరిత్రలోనే కాదు, జాతీయస్థాయిలో మైలురాయి వంటిదని సిఎం చంద్రబాబు అన్నారు. సోమవారం నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరిలో ఇన్ ఫ్లో తగ్గిందని, అదే సమయంలో కృష్ణా, తుంగభద్రలో ఇన్ ఫ్లో పెరగడం సంతోషంగా ఉందన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి నిల్వ మూడు రోజుల్లో 10 టిఎంసి పెరిగిందని, నీటిమట్టం 13 అడుగులు పెరిగిందటూ ఇది రాష్ట్ర రైతాంగానికి శుభసూచకం అన్నారు. ‘ఈ వారం వర్షాలు పడ్డాయి. వచ్చేవారం మంచి వర్షాలకు అవకాశం ఉంది. వర్షం నీటిని వదిలేస్తే సమస్యలు పెరుగుతాయి. అన్ని చెరువులు నింపాలి. ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెరిగేలా చూడాలి. 11వేల చెక్ డ్యాముల నిర్మాణం వెంటనే పూర్తిచేయాలి’ అని సిఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో 2.35 లక్షల క్యూ.మీ. మట్టి ఇప్పటివరకు తొలగించామన్నారు. ఈవారం 15వేల క్యూ.మీ. కాంక్రీట్ పని జరిగిందంటూ, చేయాల్సిన దానితో పోల్చుకుంటే ఇది చాలా స్వల్పంగా పేర్కొన్నారు. ‘వర్షాలు పడటంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులకు కావాల్సిన ఇన్‌పుట్స్ సకాలంలో అందించాలి. ఈ ఏడాది వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వృద్ధి మరింత పెరగాలి’ అని చంద్రబాబు ఆదేశించారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 27 శాతం వృద్ధి వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సాధించాం కాబట్టే రాష్ట్ర వృద్ధిరేటు 11.72 శాతానికి వచ్చిందన్నారు. ఉద్యాన రంగంలో వృద్ధి 30 శాతానికి చేరాలని ఆకాంక్షించారు. విత్తనాలు, ఎరువులు, పంట రుణాల పంపిణీలో ఏయే జిల్లాలు ఏ స్థాయిలో ఉందో అడిగి తెలుసుకున్నారు. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో పురోగతి బాగా ఉందంటూ వాటి స్థాయికి మిగిలిన జిల్లాలు కూడా చేరుకోవాలన్నారు. నరేగా(జాతీయ ఉపాధి హామీ పథకం) లక్ష్యం 100 శాతం చేరుకున్నందుకు అభినందనలు తెలిపారు. ఏడాదిలో చేయాల్సిన పనులు 5 నెలల్లోనే చేసినందుకు అభినందించారు. నరేగాలో తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలు ఈ వారంలో ఏ గ్రేడ్ సాధించాయంటూ, మిగిలిన జిల్లాలు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి గ్రేడింగ్ పెంచుకోవాలన్నారు. సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించాలన్నారు. ‘స్వచ్ఛ భారత్‌లో మన రాష్ట్రం ముందుండాలి, జాతీయస్థాయిలో మన గౌరవం ఇనుమడించాలి’ అని సిఎం చంద్రబాబు ఆకాంక్షించారు.