రాష్ట్రీయం

చేనేతకు పండుగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: దసరా సందర్భంగా మహిళలకు పంపిణీ చేసేందుకు 16 నాటికి బతుకమ్మ చీరలన్నీ జిల్లా కేంద్రాలకు చేరుతాయని పరిశ్రమలు, చేనేత మంత్రి కె తారక రామారావు తెలిపారు. 18, 19, 20 తేదీల్లో చీరల పంపిణీ పూర్తవుతుందన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా ఒకవైపు నేతన్నలకు ఉపాధితోపాటు, పండగ సందర్భంగా ఆడపడుచులకు సంతోషం పంచినట్టు అవుతుందన్నారు. చీరల పంపిణీ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్లు సమన్వయం చేయాలని ఆదేశించారు. హ్యాండ్‌లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ శాఖపైన మంత్రి కెటిఆర్ సోమవారం సమీక్ష జరిపారు. ప్రభుత్వం టెక్స్‌టైల్ శాఖకు గతంలో ఎన్నడూ లేనంత సహకారం ఇస్తోందని, ఈసారి బడ్జెట్‌లో పెద్ద ఎత్తున కేటాయింపులతో పాటు పక్కా ప్రణాళికతో కార్యక్రమాలు చేపట్టావ న్నారు. కార్మికుల వ్యక్తిగత రుణాల మాఫీతో పాటు, నేతన్నకు చేయూత, యార్న్ సబ్సిడీ వంటి కార్యక్రమాలు
చేపట్టామన్నారు. ఇకపై ప్రభుత్వం సేకరించే ప్రతి మీటర్ బట్ట రాష్ట్రం నుంచే సేకరిస్తామని తెలిపారు. ఈసారి కేవలం రెండునెలల వ్యవధిలోనే కోటి ఆరు లక్షల ఆడపడుచులకు చీరలు అందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని నేతన్నల ఉత్పాదకత సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేందుకు వార్షిక ప్రణాళికను త్వరలోనే ఖరారు చేయనున్నట్టు చెప్పారు. దీంతో వచ్చే ఏడాదినుంచి రాష్ట్రంలోని నేతన్నలకు కనీసం ఎనిమిది నెలల పాటు ప్రభుత్వం సేకరించే వస్త్రాల ఉత్పత్తి పైనే పని చేసే అవకాశం వస్తుందని చెప్పారు. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న ఆర్డర్లతో నెలకు కనీసం 15వేల రూపాయల వేతనం మూడు నెలలపాటు లభిస్తుందని చెప్పారు. రంజాన్, క్రిస్టమస్, బతుకమ్మ చీరలు, రాజీవ్ విద్యా మిషన్ వస్త్రాల సేకరణను వ్యవస్థీకృతం చేయాలని కెటిఆర్ ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి పక్కా ప్రణాళిక ప్రకారం వస్త్రాల సేకరణ జరపాలని, ముందస్తుగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ప్రభుత్వం తరఫున వస్త్రాలను సేకరిస్తున్న విద్యాశాఖ, స్ర్తి శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖల శాఖాధిపతులతో కలిపి సమావేశం ఏర్పాటు చేయాలని అన్నారు.
నేతన్నల కోసం చేపట్టిన కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని చెప్పారు. నేతన్నకు చేయూత కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల్లో సమావేశాలు వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు. ఇప్పటికే చేనేత మగ్గాలు, కార్మికుల సంపూర్ణ సమాచారం ఉందని, దీంతో పాటు పవర్ లూమ్ కార్మికుల సమాచార సేకరణ పూర్తి చేయాలని అన్నారు. ప్రతి వీవర్ లెక్క టెక్స్‌టైల్ శాఖ వద్ద ఉండాలని చెప్పారు. రాష్ట్రానికి వివిధ పథకాల కింద రావలసిన కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం ఢిల్లీలో ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని అధికారులకు కెటిఆర్ సూచించారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ని కలిసి ఈ మేరకు సహకారం కోరినట్టు చెప్పారు. డిమాండ్ ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో టెస్కో షోరూమ్ ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇకపై కేంద్ర మంత్రులను కలిసే సందర్భాల్లో తెలంగాణ చేనేత వస్త్రాలు, గోల్కొండ కళాకృతులు అందించాలని కెటిఆర్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేయాలని కెటిఆర్ చెప్పారు.

చిత్రం..బతుకమ్మ చీరల పంపిణీ, హ్యాండ్‌లూమ్ పరిస్థితిపై సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి కెటిఆర్