రాష్ట్రీయం

తెలంగాణను సస్యశామలం చేస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 11: గోదావరి, కృష్ణా నదులు తెలంగాణ గడ్డపై ప్రవహిస్తున్నప్పటికీ గత పాలకులంతా ఇక్కడి భూములను ఎడారిలా మార్చారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రహదారుల భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కేసిఆర్ సిఎం అయ్యాక లక్షా యాభైవేల కోట్లతో రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలను నిర్మించి ఎడారిలా మారిన తెలంగాణను సస్యశామలం చేస్తున్నారని తెలిపారు. సోమవారం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్‌లో ఏర్పాటు చేసిన గ్రామ, మండల, జిల్లా రైతు సమన్వయ సమితుల అవగాహన సదస్సులో మంత్రులు మాట్లాడుతూ ఈ ఏడాది 700 టిఎంసిల గోదావరి జలాలు సముద్రం పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో 600 టిఎంసిల నీటితో రెండు పంటలు పండించుకునే అవకాశం ఉందన్నారు. వృథాగా సముద్రం పాలవుతున్న గోదావరి జలాలను ఒడిసిపట్టి తెలంగాణకు సీతారామ ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకొస్తున్నట్లు వివరించారు. గత పాలకులందరూ రైతు బిడ్డలమేనని చెప్పుకున్నారని, అయితే వారంతా రైతులకు ఏమీ చేయలేదన్నారు. కనీసం రైతుల పరిస్థితి కూడా ఆలోచించలేక పోయారన్నారు. వారంతా నిజంగా రైతు బిడ్డలైతే రైతులు ఈ దుస్థితిలో ఎందుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాకముందు ఓ ముఖ్యమంత్రి నీకెందుకు తెలంగాణ, తెలంగాణ వస్తే రాష్ట్రంలో చీకట్లే ఉంటాయని ఎగతాళి చేశారని గుర్తుచేశారు. తెలంగాణను సాధించిన కెసిఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెలిగిపోతుంటే ఆ ముఖ్యమంత్రి మాత్రం చీకట్లోనే కలిసి పోయారని విమర్శించారు. గతంలో ఏ ఒక్కరూ రైతుల కోసం ఆలోచించక పోవటం వల్లనే రైతులు చితికి పోయారని అన్నారు. అందరికీ సంఘాలున్నప్పటికీ రైతుకు మాత్రం సంఘం లేదన్నారు. ఇందుకే వారికి సంఘాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా భూముల రికార్డులను ప్రక్షాళన చేస్తామన్నారు. వ్యవసాయం చేసే రైతులకే పెట్టుబడులను అందిస్తామన్నారు. రైతు బలంగా ఉంటేనే దేశం, రాష్ట్రాలు బలంగా ఉంటాయన్నారు. ఇందుకే రైతుల కోసం అన్ని సదుపాయాలను సమకూర్చటమే తమ ధ్యేయమన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ లోకేష్ కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, జిల్లా పరిషత్ చైర్మన్ గడిపల్లి కవిత, మండల రైతు కమిటీ చైర్మన్ శివరాం ప్రసాద్ పాల్గొన్నారు.

చిత్రం..పెనుబల్లి మండలంలో నిర్వహించిన సభలో ప్రసంగిస్తున్న టి. మంత్రి పోచారం