రాష్ట్రీయం

గౌహతి-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: అధిక రద్దీని నివారించేందుకు గాను గౌహతి-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 14న ప్రత్యేక రైలు ఉదయం 6.20కి గౌహతి నుంచి బయలు దేరి 16వ తేదీ శనివారం తెల్లవారు జామున నాలుగు గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని రైల్వే తెలిపింది. ఈ సౌకర్యాన్ని రైల్వే ప్రయాణీకులు వినియోగించుకోవాలని స్పష్టం చేసింది.
సంత్రాగాచి-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు రద్దు
ఈ నెల 12న వెళ్లాల్సిన సంత్రాగాచి-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు నెం.07183ని తక్కువ ప్రయాణీకుల ఆదరణ కారణంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.