రాష్ట్రీయం

అవినీతిపై మరోసారి ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఖైరతాబాద్, సెప్టెంబర్ 11: దేశంలో అవినీతి అంతం మొందించేందుకు మరోసారి ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్టు సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే పేర్కొన్నారు. సోమవారం సోమజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సర్పంచుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రధానికి రాసిన లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా అన్నాహజారే వీడియోకాల్‌లో మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంలో అవినీతి రూపుమాపేందుకు లోక్‌పాల్, లోకాయుక్తలను సమర్థవంతంగా అమలు చేయాలని ఎన్నో ఎళ్లుగా పోరాడుతున్నా ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మోడి ప్రధాని అయి మూడేళ్లు అవుతున్నా ఈ అంశంపై స్పందించక పోవడం విచారకరమన్నారు. పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టాలని పలుమార్లు ప్రధానికి తాను లేఖలు రాసినట్టు చెప్పారు. గతంలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని జరిగిన ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు ఆదరించారని, పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు ఉద్యమం పాకి ప్రజలంతా మద్దతుగా రోడ్లపైకి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అవినీతి నిర్మూలనకు ఈ రెండు బిల్లులు ఆమోదం పొంది చట్టాలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వీటితోపాటు దేశంలో వ్యవసాయరంగం సంక్షోభం నుంచి గట్టేందుకు స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే దేశ రాజధానిలో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని, అవినీతి అంతం కోసం జరిగే పోరాటంలో ప్రజలంతా కలిసి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. అన్నాహజారే ఉద్యమానికి తమ పూర్తిమద్దతు ఉంటుందని ఐక్య వేదిక అధ్యక్షుడు కృష్ణ తెలిపారు.