రాష్ట్రీయం

మెరిట్ తెచ్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 12: ‘ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా 80 శాతం ప్రజా సంతృప్తే లక్ష్యం. ప్రస్తుతం 59శాతం సంతృప్తికి చేరుకున్నాం. ఇంకా 41 శాతం అసంతృప్తి ఉంది. దీన్ని 20 శాతానికి తగ్గించాలి. నంద్యాల, కాకినాడలో పెరిగిన 16 శాతం ఆధిక్యతను బెంచ్ మార్క్‌గా తీసుకోవాలి. ప్రభుత్వ సర్వేలో గతం కన్నా 20 శాతం పెరిగిందని వచ్చింది. సంతృప్తస్థాయి 60 నుంచి 80 శాతానికి పెంచడంలోనే మన సమర్థత కనిపిస్తుంది. ప్రభుత్వ లబ్ధి ప్రతి పేదకు అందాలి. ప్రభుత్వ పథకాలపై ప్రతి కుటుంబం అభిప్రాయం తెలుసుకోవాలి. ప్రతి గ్రామంలో ప్రజాస్పందన తెలుసుకోవాలి. పుష్కరాల్లో ఏ విధంగా అయితే ప్రజా సంతృప్తి తెలుసుకుని పనిచేశామో అదేవిధంగా ప్రభుత్వ పథకాల లబ్ధి విషయంలో ప్రజాస్పందన తెలుసుకోవాలి’ అని తెదేపా అధినేత, సిఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం మంత్రులు, పార్టీ నేతలతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అరకొరగా చేస్తే ఫలితాలు రావు. కన్‌ఫ్యూజన్ లేకుండా క్లారిటీతో పనిచేయాలి. రోడ్ మ్యాప్ అమలుచేయాలి. వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు అభిప్రాయాలు ఉంటాయి, వాటిని చేరుకోవాలి. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకోవాలి అని సూచించారు. ‘మోస్ట్ డిజర్వింగ్, ప్రిఫర్‌బులీ డిజర్వింగ్, నాట్ డిజర్వింగ్ 3 రకాలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి ఆశించేవారిని వర్గీకరించాలి. మోస్ట్ డిజర్వింగ్ అందరికీ అందేలా చూడాలి. తరువాత ప్రిఫరబులీ డిజర్వింగ్ వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. అనర్హులకు మాత్రం లబ్ధి చేకూర్చరాదు. పార్టీ ద్వారా, ప్రభుత్వం ద్వారా సేకరించే ప్రజాభిప్రాయాన్ని అనుసంధానం చేయాలి. ప్రజల్లో సంతృప్తిని పెంచడానికి ఏమి చేయగలమో అన్నీ చేయాలని’ చెప్పారు. టెక్నాలజీని సమస్యల పరిష్కారం కోసం, పారదర్శకతకు ఉపయోగించాలన్నారు. రేషన్, పెన్షన్ పంపిణీని సంతృప్తస్థాయికి తీసుకువెళ్లే అవకాశం ఉందన్నారు. చంద్రన్న బీమా, 75 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉపకార వేతనాలు వీటన్నింటిని అర్హత ప్రకారమే ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వారం వారం ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం పురోగతిపై ప్రోగ్రెస్ షీట్ విడుదల చేయాలన్నారు. 175 మంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు రాష్ట్రంలో అన్ని ఇళ్లకూ వెళ్లి, ప్రతి తలుపు తట్టి, ప్రతి కుటుంబాన్ని పలకరించి యోగక్షేమాలు తెలుసుకోవాలి. వాళ్ల అవసరాలు విచారించి పరిష్కరించడం ద్వారా
సంతృప్తస్థాయి పెంచాలన్నారు. ‘ఇంటింటికి తెలుగుదేశంలో భాగంగా ప్రతి జిల్లాలో నేను పర్యటిస్తా. ఉదయం 3 గంటలపాటు ఊళ్లో ఇంటింటికి తిరుగుతా గ్రామస్థులతో భేటీ అవుతా. గ్రామాభివృద్ధి ప్రణాళిక రూపొందిస్తా. మధ్యాహ్నం 3గంటలపాటు డ్వాక్రా మహిళలతో సమావేశం అవుతా. సాయంత్రం 6 గంటలకు పార్టీ కార్యకర్తలతో భేటీ అవుతా. సమన్వయం, పార్టీ అంతర్గత వ్యవహారాలపై 3గంటలు చర్చిస్తా. ఇదే ప్రణాళికతో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో నిర్వహించాలి’ అని బాబు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు యనమల, నారాయణ, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు, ఎమ్మెల్సీలు టిడి జనార్ధన్, వివివి చౌదరి, ప్రభుత్వ సలహాదారులు పరకాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.