రాష్ట్రీయం

పట్టు తప్పుతున్న పోర్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 12: కార్గో హ్యాండ్లింగ్‌లో దేశంలోనే టాప్ త్రీ అనిపించుకున్న విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ క్రమంగా పట్టుకోల్పోతోంది. గతంలో మాన్యువల్‌గా కార్గో హ్యాండ్లింగ్ చేసిన విశాఖపట్నం పోర్టు, ఇప్పుడు పూర్తి యాంత్రీకరణకు మారింది. దీంతోపాటు విశాఖపట్నం పోర్టుకు భారీ నౌకలు వచ్చేందుకు వీలుగా డ్రాఫ్ట్‌నూ పెంచారు. కోల్ ఎగుమతి, దిగుమతుల్లో విశాఖ పోర్టు ట్రస్ట్ అగ్రగామిగా ఉండేది. అలాగే ఐరన్ ఓర్, ఫెర్టిలైజర్ల హ్యాండ్లింగ్‌తో ఎప్పుడూ బిజిగా ఉండే విశాఖ పోర్టు వైభవం చాలావరకూ తగ్గింది. విశాఖపట్నం పోర్టుకు అత్యంత సమీపంలో ఉన్న గంగవరం పోర్టు గత ఆరేడేళ్ల నుంచి తన కార్యకలాపాలను ముమ్మరం చేసుకుంది. అంతేకాదు, విశాఖపట్నం పోర్టుకు పోటీగా నిలబడింది. విశాఖపట్నం పోర్టుకు వచ్చే కార్గోను తనవైపునకు మళ్లించుకుంది. దీంతో విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ఆదాయానికి భారీగా గండిపడింది. దీనికి కొన్ని కారణాలు కూడా లేకపోలేదు.
విశాఖపట్నం పోర్టులో వెసల్స్ నుంచి దిగుమతి చేసుకున్న కార్గోను కొంత కాలంపాటు యార్డులో నిల్వ చేసుకునేందుకు స్టీవ్‌డర్ కంపెనీలు భారీ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది. స్క్వేర్ సెంటీ మీటరుకు 3.11 రూపాయలు విశాఖపట్నం పోర్టు యాజమాన్యం వసూలు చేస్తోంది. అంటే ఒక వెసల్‌లో సుమారు 50 వేల టన్నుల కార్గో దిగుమతి అయి, దాన్ని యార్డుకు తరలిస్తే, దీనికి 12 వారాలకు సుమారు 80 వేలు చెల్లించాల్సి ఉంటుంది. గంగవరం పోర్టు అయితే, ఈ ఛార్జీలు ఉండవు. అలాగే, టెర్మినల్ ఛార్జి ఒక టన్నుకు 11 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ చార్జీలు కూడా గంగవరం పోర్టులో ఉండవు. అంతేకాదు, లక్ష డిడబ్ల్యుటి సామర్థ్యం కలిగిన నౌకలు విశాఖపట్నం పోర్టులోకి రావు. ఈ పోర్టుకు సమీపంలో ఉన్న వేదాంత బెర్త్‌కు మాత్రమే నౌకలు రాగలుగుతాయ. అక్కడ బెర్త్‌లు ఖాళీగా లేకపోవడంతో ఇటువంటి భారీ నౌకలు గంగవరం పోర్టుకు వెళ్లిపోతున్నాయని తెలుస్తోంది.
దీనివలన విశాఖపట్నం పోర్టులోకి భారీగా వచ్చే కోల్ ఇప్పుడు గంగవరం పోర్టుకు వెళ్లిపోయింది. అలాగే ఐరన్ ఓర్ విషయానికి వచ్చేప్పటికి గతంలో రోజుకు 10 నుంచి 15 రేక్‌ల సరుకు రవాణా అయ్యేది. కానీ ఇప్పుడు నెలకు 10 నుంచి 15 రేక్‌లు కూడా అవ్వడం లేదని తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని మేజర్ పోర్టుల్లో ఒకటైన విశాఖపట్నం పోర్టు భవిష్యత్‌లో తన ఆథిపత్యాన్ని ఎలా నిలబెట్టుకుంటుందో వేచి చూడాలి.