రాష్ట్రీయం

తెలుగుకు కొత్త వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ప్రపంచ తెలుగు మహాసభలను డిసెంబర్ 15నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించనున్నట్టు సిఎం చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. మహాసభల ప్రారంభోత్సవం, ముగింపు కార్యక్రమాలకు ప్రధాన మంత్రి, రాష్టప్రతిని ఆహ్వానించాలని నిర్ణయించారు. మహాసభల నిర్వహణకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే సాహిత్య అకాడమీకి రూ.5 కోట్లు, అధికార భాషా సంఘానికి రూ.2 కోట్లు సభల నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్టు చెప్పారు. మహాసభల నిర్వహణకు సాహిత్య అకాడమీ నోడల్ ఏజెన్సీగా ఉంటుందన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై ప్రగతి భవన్‌లో మంగళవారం సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీ్ధర్, సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సభల నిర్వహణపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. వాస్తవానికి అక్టోబర్‌లోనే ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ, అదే నెలలో హైదరాబాద్‌లో ప్రపంచ పర్యాటక సదస్సు, నవంబర్‌లో ప్రపంచ పారిశ్రామిక సదస్సులు ఉండటంవల్ల తెలుగు మహాసభలు డిసెంబర్‌లో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఎల్‌బి స్టేడియం ప్రధాన వేదికగా మహాసభలు నిర్వహించాలని, రవీంద్రభారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలిత కళాతోరణం, నిజాం కాలేజీ మైదానం, భారతీయ విద్యాభవన్, పింగళి వెంకట్రామారెడ్డి హాల్, శిల్పకళా వేదిక తదితరచోట్ల కూడా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. మహాసభల్లో తెలంగాణలో తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి జరిగిన ప్రయత్నాలపై చర్చా గోష్టులతోపాటు గోల్కొండ నుంచి వెలువడిన తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి చాటాలని నిర్ణయించారు. ఉదయం సాహిత్య గోష్టులు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ, గోండు నృత్యాలు, కోలాటం, పేరిణి, కలుపు, నాట్ల, కోత, దుక్కి పాటలు, జానపద గేయాలు వంటి అంశాలు ప్రదర్శించాలని నిర్ణయించారు. దేశ, విదేశాల నుంచి అతిథులను ఆహ్వానించడానికి అమెరికా, యూరప్, గల్ఫ్, మారిషస్, సింగపూర్, మలేషియా తదితర దేశాలలో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సిఎం వెల్లడించారు.

చిత్రం..ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణపై నిర్వహించిన
సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్