రాష్ట్రీయం

రాత్రి 11 వరకూ మందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: మద్యం షాపులకు నెలాఖరుతో గడువు ముగియనుండటంతో అక్టోబర్ 1నుంచి కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పాలసీ ప్రకారం మద్యం షాపుల లైసెన్స్‌ల జారీకి నేటి (బుధవారం) నుంచి ఈనెల 19 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. కొత్త పాలసీకి 2017 అక్టోబర్ నుంచి 2019 సెప్టెంబర్ 30 వరకు రెండేళ్ల కాలపరిమితి విధించింది. అలాగే కొత్త పాలసీలో అమ్మకాల సమయాన్నీ పెంచారు. ప్రస్తుతం రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంచే సమయాన్ని రాత్రి 11 గంటలకు పెంచింది. మద్యం షాపుల లైసెన్స్‌లకు దరఖాస్తుల ఫీజు ప్రస్తుతం రూ. 50 వేలు ఉండగా కొత్త పాలసీలో దీన్ని లక్షకు పెంచింది. అలాగే ఒక వ్యక్తి ఒక షాపునకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనను పెట్టింది. అలాగే మద్యం షాపుల వేళలనూ కొత్త పాలసీలో సవరించింది.
ప్రస్తుతం రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంచే సమయాన్ని రాత్రి 11 గంటలకు పెంచింది. జనాభా ప్రాతిపదికన ప్రస్తుతం ఆరు శ్లాబుల్లో లైసెన్స్ ఫీజులను వసూలు చేస్తుండగా, కొత్త పాలసీలో నాలుగు శ్లాబులకు కుదించింది. యాభై వేల జనాభా వరకు మద్యం షాపుల లైసెన్స్ వార్షిక ఫీజు రూ. 45 లక్షలు, ఐదు లక్షల జనాభా వరకు రూ.55 లక్షలు, ఇరవై లక్షల జనాభా వరకు రూ.85 లక్షలు, ఇరవై లక్షల జనాభాకు పైబడినచోట (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి) వార్షిక లైసెన్స్ ఫీజు రూ. కోటి 10 లక్షలుగా ఖరారు చేసింది. ప్రస్తుతం కూడా ఇదే మొత్తంలో
లైసెన్స్ ఫీజు అమల్లో ఉంది. కొత్త పాలసీ మేరకు ఆబ్కారీ శాఖ ఆదాయం రూ. 15 వేల కోట్లు వస్తుందని అంచనా వేసినట్టు రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్ తెలిపారు. మద్యం అమ్మకాలకు తప్పనిసరిగా ఎమ్మార్పీ రేట్లు అమలు కావడానికి ప్రతీ షాపు ఎదుట రెండు సిసి కెమెరాలు అమర్చి, వాటిని ఆబ్కారీ శాఖకు అనుసంధానం చేయనున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోవున్న మద్యం షాపుల సంఖ్యలో ఎలాంటి మార్పూ లేదని, అయితే హైదరాబాద్ నగరంలో నోటిఫై చేసిన షాపులలో 72 షాపులకు గతంలో ఎవరు దరఖాస్తు చేసుకోకపోవడంతో వాటిని డిమాండ్ ఉన్నచోట ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు సోమేష్‌కుమార్ తెలిపారు.