రాష్ట్రీయం

25నే సర్కారు వేతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: బతుకమ్మ, దసరాతోపాటు అక్టోబర్ 1న మొహ్రరం పండుగలు ఉండటంతో ఈనెల 25నే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని ఆర్థిక శాఖ అధికారులను సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ కూడా వీలైనంత త్వరగా విడుదల చేయాలని ఆదేశించారు. వరుస పండుగలను పురస్కరించుకొని వేతనాలు ముందుగా చెల్లించాలని టిఎన్‌జివోల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, కార్యదర్శి మామిళ్ల రాజేందర్, గెజిటెడ్ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మె ల్యే శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యమంత్రిని కోరారు. ఈ మేరకు సీఎం సానుకూలంగా స్పందించి ఆర్థికశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడత డిఏ చెల్లించడం వల్ల ఏడాదికి ప్రభుత్వంపై రూ.580 కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు.