రాష్ట్రీయం

బైసన్‌పోలో, జింఖానా మైదానం బదలాయింపుపై 19లోగా నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: సికింద్రాబాద్‌లో బైసన్‌పోలో, జింఖానా మైదానాన్ని తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణానికి కేటాయించడంపై స్టేటస్ రిపోర్టు సమర్పించాలంటూ హైకోర్టు మంగళవారం కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నివేదికను సెప్టెంబర్ 19వ తేదీలోగా సమర్పించాలని కోరింది. బైసన్‌పోలో, జింఖానా మైదానాన్ని కొత్త సచివాలయం నిర్మాణానికి కేంద్రం కేటాయించడాన్ని సవాలు చేస్తూ పూర్వ డిజిపి ఎంవి భాస్కరరావు, క్రికెటర్ వివేక్ జయసింహ, చార్టెర్డ్ అకౌంటెంట్ టి భరద్వాజ తదితరులు పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఉమాదేవితో కూడిన ధర్మాసనం విచారించింది.ప్రస్తుతం ఈ రెండు గ్రౌండ్స్‌ను రక్షణ మంత్రిత్వ శాఖ ఉపయోగించుకుంటోందని, ఇటీవల వీటిని రాష్ట్రప్రభుత్వానికి కేటాయించిందన్నారు. ఈ రెండు కంటోనె్మంట్ పరిధిలలోకి వస్తాయని, రాష్టప్రతికి ఒక్కటే వీటిని కేటాయించే అధికారం ఉందన్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కె లక్ష్మణ్ వాదనలు వినిపిస్తూ ఈ రోజు వరకు ఈ మైదానాలను రాష్ట్రప్రభుత్వానికి కేటాయిస్తున్నట్లు సమాచారం లేదన్నారు.
సరైన సమాచారాన్ని కేంద్రం నుంచి తెలుసుకుని తెలియచేస్తామన్నారు. అనంతరం కేంద్రం, రాష్ట్రం కూడా ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ, కేసు విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేశారు.