రాష్ట్రీయం

బస్టాండ్లలో బాలింతలకు ప్రత్యేక గదులు ఏర్పాటుచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 12: ఆర్టీసి బస్టాండ్లలో తల్లులు తమ పిల్లలకు పాలిచ్చేందుకు వీలుగా ప్రత్యేక రూంలను ఏర్పాటు చేసే విషయమై తీసుకుంటున్న చర్యలను వివరించాలని కోరుతూ ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు, కేంద్రం, ఏపిఎస్ ఆర్టీసి, టిఎస్ ఆర్టీసికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మహిళల ఆత్మగౌరవం వారి వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించేందుకు తీసుకుంటున్న చర్యలనువివరించాలని హైకోర్టు ఆదేశించింది. విశాఖపట్నంకు చెందిన విపి మంగళం హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను పిటిషన్‌గా హైకోర్టు స్వీకరించింది. అనంతరం హైకోర్టు ఈ కేసు విచారణను అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేసింది.