రాష్ట్రీయం

జన‘సేన’కు ఔత్సాహిక వేదికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: జనసేన పార్టీ యువ విభాగాలకు వివిధ కార్యక్రమాలకు యువతను రిక్రూట్‌చేసుకునేందుకు ఈ నెల 18వ తేదీన గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా ల్లో సమావేశాలను నిర్వహించనుంది. దసరా అనంతరం కృష్ణా జిల్లాలో మరో సమావేశాన్ని నిర్వహించడంతో దాదాపు జనసేన ఔత్సాహిక వేదికలు చివరి అంకానికి చేరుకుంటాయి. ఈనెల 7వ తేదీన ఖమ్మంలో జరిగిన శిబిరంతో తెలంగాణలో ఔత్సాహిక వేదికల కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాలు కేంద్రంగా ఈ శిబిరాల ను నిర్వహించగా, వేలాది మంది యువకులు జనసేనలో చేరేందుకు , జనసేనతో కలిసి పనిచేసేందుకు ఆస క్తి చూపించారు. ఎక్కువ స్పందన రావడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 18, 19 తేదీల్లో గుంటూరు కిలారి కోటేశ్వరరావు ఫంక్షన్ హాల్‌లోనూ, ఈ నెల 20, 21 తేదీల్లో ఏలూ రు సీతారామ భర్తియా కళ్యాణ మండపంలోనూ ఔత్సాహిక వేదికల శిబిరాలు జరుగుతాయని ఆయన చెప్పారు.
స్పీకర్లు, అనలిస్టులు, కంటెంట్ రైటర్లు విభాగాలకు గుంటూరు జిల్లా నుండి 3786 దరఖాస్తులు, పశ్చిమగోదావరి జిల్లా నుండి 4913 దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా జనసేన పరిపాలనా విభాగానికి వచ్చాయని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు కూడా ఈ శిబిరాల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నామని చెప్పారు.
ఔత్సాహికులు తమ పేర్లను వేదిక వద్ద నమోదు చేసుకుని ఈ శిబిరాల్లో పాల్గొనవచ్చని ఆయన చెప్పారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిందరికీ ఎస్‌ఎంఎస్‌లు, ఇమెయిల్‌ల ద్వారా సమాచారాన్ని పంపించామని చెప్పారు. అలా గే ఫేస్‌బుక్‌లో కూడా ఇతర వివరాలు జోడిస్తున్నామని పవన్ వివరించారు.